POCSO Case : యడియూరప్పకు స్వల్ప ఊరట
గతేడాది ఫిబ్రవరి 2న మైనర్ అయిన తన కూతురుపై యడియూరప్ప లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయం కోసం కూతురుతో కలిసి వెళ్లానని, యడియూరప్ప తమతో 9 నిమిషాలపాటు మాట్లాడారని, ఆ తర్వాత బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
- Author : Latha Suma
Date : 14-03-2025 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
POCSO Case : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఊరట దక్కింది. పోక్సో కేసులో ఆయనకు కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు న్యాయస్థానం స్వల్ప ఊరట కల్పించింది. మార్చి 15న పోక్సో కేసు విచారణకు హాజరుకావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇటీవల ఆయనను ఆదేశించింది. తాజాగా కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది.
Read Also: CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు : సీఎం చంద్రబాబు
గతేడాది ఫిబ్రవరి 2న మైనర్ అయిన తన కూతురుపై యడియూరప్ప లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయం కోసం కూతురుతో కలిసి వెళ్లానని, యడియూరప్ప తమతో 9 నిమిషాలపాటు మాట్లాడారని, ఆ తర్వాత బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొంది.
అయితే ఇటీవల తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని యడియూరప్ప.. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. బాలికపై దాఖలైన లైంగిక వేధింపుల అంశంలో పోక్సో కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Delhi Capitals: గత 17 ఏళ్లలో 14 మంది కెప్టెన్లను మార్చిన ఢిల్లీ క్యాపిటల్స్!