Punjab: శివసేన నేత దారుణ హత్య..!!
- By hashtagu Published Date - 10:04 PM, Fri - 4 November 22

పంజాబ్ లో శివసేన నేతను దారుణంగా కాల్చి చంపారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన అమ్రుత్ సర్ లోని ప్రార్థనమందిరంలోపల జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గోపాల్ మందిర్ ఆలయ ప్రాంగణం దగ్గర చెత్తకుప్పలో విగ్రహాలు కనిపించాయి. దీనిపై శివసేన నాయకులు ఆందోళనకు దిగారు. ఇంతలో గుంపులో నుంచి ఓ దుండగుడు వచ్చి సుధీర్ సూరిని కాల్చాడు. వెంటనే సూరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సుధీర్ సూరి హత్యపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రతీగాంధీ స్పందించారు. ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూరి ఖలీస్తాన్ లిస్టులో ఉన్నాడని అందుకే చంపారంటూ ప్రీతిగాంధీ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ గుజరాత్ ఆప్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని అందుకే రాష్ట్రంలోని శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పాలన గాడితప్పిందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు.