Cyber Phone call : ప్రాణాలు తీసిన సైబర్ కాల్ ..
- By Sudheer Published Date - 06:15 PM, Fri - 4 October 24

టెక్నలాజి (Technology) రోజు రోజుకు ఎంతగా అభివృద్ధి చెందుతుందో తెలియంది కాదు..ఈ టెక్నలాజి ని మంచి వాడేకంటే చెడుకు ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) టెక్నలాజి వాడుకుంటూ అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఇళ్లలో దొంగతనాలు చేయడం.. జేబులు కట్ చేసి డబ్బులు దొంగతనాలు చేయడం ..బ్యాంకు రాబడి వంటివి చేయడం చేసేవారు కానీ ఇప్పుడు బెదిరింపు కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా పోలీస్ ఆఫీసర్ల ఫోటోలు పెట్టుకొని..ఎవరికొకరికి ఫోన్ కాల్ చేయడం మీ కూతురు పలు కేసుల్లో చిక్కుకుందని..నేరం రుజువైతే జైలు శిక్ష పడుతుందని..భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు ఎంతోమందికి డబ్బులు డిమాండ్ చేసి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ఓ స్కూల్ టీచర్ కి ఫోన్ చేసి మీ కూతురు వ్యభిచార రాకెట్‌లో పట్టుబడి అరెస్ట్ అయ్యిందని, వీడియోలు లీక్ చేయకుండా ఉండేందుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కాల్ తో ఆందోళనకు గురైన ఆ తల్లి గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
ఆగ్రాలోని ఓ స్కూల్‌ల్లో టీచర్‌గా పని చేస్తున్న మల్తీ వర్మకు సెప్టెంబర్ 30న వాట్సాప్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను పోలీస్‌నని చెప్పుకొచ్చాడు. మీ కుమార్తె వ్యభిచార రాకెట్‌లో పట్టుబడి అరెస్ట్ అయ్యిందని, మీ కుమార్తె అసభ్య వీడియోలను లీక్ చేయకుండా ఉండాలంటే రూ.లక్ష అప్పటికప్పుడే ఆన్‌లైన్‌లో పంపించాలని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన మహిళా టీచర్ వెంటనే తన కుమారుడు దివ్యాన్షకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పింది. అయితే ఆమె తనకు వచ్చిన ఫోన్ కాల్ నంబర్ చెప్పమని అడగ్గా.. దానికి 92+ ప్రిఫిక్స్ ఉన్నట్లు గమనించాడు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆ వాట్సాప్ కాల్ ఫేక్ అని, కంగారు పడవల్సిన అవసరం లేదని తల్లికి ఫోన్‌లో చెప్పాడు. అనంతరం తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు చెప్పింది. అయినప్పటికీ ఆమెలో భయం మాత్రం అంతకంత పెరగసాగింది. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలి పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇలాంటి ఫేక్ కాల్స్ ఫై ఇప్పటికే పోలీసులు సూచనలు తెలియజేస్తున్నారు. 92+ తో వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయద్దని..ఒకవేళ లెఫ్ట్ చేసిన ఏమాత్రం భయపడొద్దని సూచిస్తున్నారు. తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయాలనీ కోరుతున్నారు.
Read Also : Aravind Swamy : అరవింద్ స్వామి కెరీర్ గ్యాప్ రీజన్స్ అవేనా..?