Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదు
- Author : Balu J
Date : 20-12-2023 - 4:07 IST
Published By : Hashtagu Telugu Desk
Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మే 21 నుండి ఇదే అత్యధికం. అయితే క్రియాశీల కేసులు 2,311 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 24 గంటల వ్యవధిలో కేరళలో మూడు మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,33,321గా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,346 కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ బులెటిన్‌ను విడుదల చేసింది. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో మంగళవారం నాలుగు పాజిటివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులను తొమ్మిదికి చేరాయని తెలిపింది. పిల్లలు, సీనియర్ సిటీజన్స్ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు అన్నారు.
Aslo Read: BRS Party: అప్పు ప్రతీసారీ తప్పు కాదు, కాంగ్రెస్ శ్వేతపత్రంపై BRS రియాక్షన్