HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >41 Airports Across India Receive Hoax Bomb Threats Over Mail

Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం.

  • Author : Vamsi Chowdary Korata Date : 18-06-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bomb Threat
Bomb Threat

Bomb Threat: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం. దీంతో పోలీసులలో అప్రమత్తమయ్యారు. సదరు విమానాశ్రయాల భద్రతను పటిష్టం చేశారు. అయితే, భద్రతా సంస్థల విచారణ తర్వాత, బెదిరింపులన్నీ నకిలీవిగా తేలింది. మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ఈ ఇమెయిల్ వచ్చిందని, ఆ తర్వాత భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశామని ఒక అధికారి తెలిపారు.

ఈరోజు ఉదయం 11:42 గంటలకు ఎయిర్‌పోర్టులో బాంబు ఉన్నట్లు ఈమెయిల్‌ వచ్చిందని వడోదర డీసీపీ పన్నా మోమయ సమాచారం అందించారు. దీని తరువాత ఎస్పీవోల సహాయంతో విమానాశ్రయాన్ని తనిఖీ చేసినట్లు, అయితే ఎక్కడా బాంబు దొరకలేదని తెలిపారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా విమానాశ్రయంలో భారీగా భద్రతను పెంచారు. ఈమెయిల్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

రాజధాని జైపూర్‌లోని బనిపార్క్ ప్రాంతంలోని పరీక్ కాలేజీకి బాంబు బెదిరింపు వచ్చింది. కాలేజీలో కాల్పుల బెదిరింపు కూడా వచ్చింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో కాలేజీ యాజమాన్యాన్ని మెయిల్ ద్వారా బెదిరించారు. ఈ సమాచారాన్ని పోలీసు కంట్రోల్ రూమ్‌కు కూడా అందించారు. దీని తర్వాత పరీక్ కాలేజీని ఖాళీ చేసి సోదాలు చేశారు. మెయిల్ ఏ ఐడీ నుంచి వచ్చిందనే దానిపై సైబర్ బృందాలు పనిచేస్తున్నాయి. మెయిల్ పంపిన వ్యక్తి ఇలా వ్రాశాడు. మీ కాలేజీలో బాంబు పెట్టామని, ఆ బాంబ్ ఒకరి బ్యాగ్‌లో ఉన్నాడని ఈమెయిల్ లో పేర్కొన్నాడు. అందరినీ కాల్చి చంపేయడానికి ఒక వ్యక్తి తుపాకీతో కాలేజీ లోపలికి వస్తాడని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు.

Also Read: Sangareddy : బయటకు కోళ్ల ఫామ్..లోపల మత్తుపదార్దాల తయారీ..ఏమన్నా ప్లానా..!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 41 airports
  • bomb threat
  • colleges
  • india
  • mail

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd