Sangareddy : బయటకు కోళ్ల ఫామ్..లోపల మత్తుపదార్దాల తయారీ..ఏమన్నా ప్లానా..!!
గుమ్మడిదల మండలం కొత్తపల్లి శివారులో కోళ్ల ఫారం లో మత్తుపదార్దాలు తయారీ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న టీజీ-నాబ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి
- By Sudheer Published Date - 11:24 PM, Tue - 18 June 24

గత కొంతకాలంగా డ్రగ్స్ మాఫియా తెలంగాణ లో విచ్చలవిడి అయ్యింది. క్లబ్స్ నుండి ఈరోజు స్కూల్స్ ముందు అమ్మే స్థాయికి వచ్చింది. బడాబాబులు కాదు స్కూల్ కు వెళ్లే విద్యార్థులు సైతం డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్..మొదటి నుండి డ్రగ్స్ విషయంలో చాల కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ విషయంలో పోలీసులకు ఫుల్ ఆదేశాలు ఇచ్చింది. డ్రగ్స్ తీసుకునే వారే కాదు అమ్మే వారు..తయారీ చేసే వారిఫై కూడా నిఘా పెట్టి కఠిన శిక్షలు విధించాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోదాలు జరుపుతూ గంజాయి, తదితర డ్రగ్స్ పదార్దాలను పట్టుకుంటున్నారు.
తాజాగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి శివారులో కోళ్ల ఫారం లో మత్తుపదార్దాలు తయారీ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న టీజీ-నాబ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి కోటి రూపాయలు విలువ గల 2.6 కిలోల ఆల్ఫా జోలంతో పాటు, ముడి పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మత్తు పదార్ధాలను తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పంచలింగాలకి చెందిన కెమిస్ట్ రాకేశ్ వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని కోళ్లఫారం నిర్వహిస్తూ అక్రమంగా ఆల్ఫా జోలం తయారు చేస్తున్నారు. తయారు చేసిన మత్తుపదార్ధాన్ని అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ గౌడ్ అనే కల్లు దుకాణాల్లో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ తయారీలో నలుగురు నిందితుల్లో అంజిరెడ్డి, రాకేశ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మరో నిందితుడు సాయికుమార్ గౌడ్ జైల్లో ఉన్నట్లు ఎస్పీ రూపేశ్ తెలిపారు. వీరు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని కోళ్ల ఫారం నిర్వహిస్తూ ఈ అక్రమ నిషేధిత మత్తు పదార్థం తయారీ చేస్తున్నారని వివరించారు.
Read Also : Health Tips: ఈ 5 రకాల పండ్లు షుగర్ పేషెంట్ లకు మేలు చేస్తాయని మీకు తెలుసా?