HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >26 11 Mumbai Attacks Trump Accepts Tahoor Ranas Extradition

26/11 Mumbai Attacks : తహవూర్‌ రాణా అప్పగింతకు ట్రంప్‌ అంగీకారం

అంతేకాదు మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ట్రంప్‌ హెచ్చరించారు.

  • Author : Latha Suma Date : 14-02-2025 - 12:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
26/11 Mumbai Attacks Trump Accepts Tahoor Rana's Extradition
26/11 Mumbai Attacks Trump Accepts Tahoor Rana's Extradition

26/11 Mumbai Attacks : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముంబయి ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నామంటూ ట్రంప్ విలేకరులతో అన్నారు. అంతేకాదు మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ట్రంప్‌ హెచ్చరించారు.

Read Also: Trump Praises PM Modi: ప్ర‌ధాని మోదీపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు!

ఇక, ఈ ప్రకటనపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముంబయి ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 64 ఏళ్ల తహవూర్‌ రాణా పాకిస్థాన్‌ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా అతడిని గుర్తించారు. ప్రస్తుతం రాణా లాస్‌ ఏంజెల్స్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలని భారత్‌ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది.

తహవూర్‌ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ.. 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.

Read Also: Valentine’s Day : ప్రేమను నిరాకరించిందని యువతిపై యాసిడ్ దాడి

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 26/11 Mumbai attacks
  • Donald Trump
  • extradition
  • india
  • pm modi
  • Tahawwur Rana

Related News

Attack on Chabahar port after Trump's warning

US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

డొనాల్డ్ ట్రంప్, మరిన్ని దాడులు జరిగితే మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని టెహ్రాన్‌ను హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత, గురువారం నాడు అమెరికా ఇరాన్ యొక్క వ్యూహాత్మక ఓడరేవు అయిన చబహార్‌లోని కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఈ దాడులు ఆగ్నేయ ఓడరేవు నగరంలోని రెండు సముద్ర రేవులను మరియు ఒక సముద్ర ట్రాఫిక్ నియంత

  • Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

    Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

    Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

  • Teejan Bai Passes Away

    Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd