Valentine’s Day : ప్రేమను నిరాకరించిందని యువతిపై యాసిడ్ దాడి
Valentine's Day : గణేష్ అనే యువకుడు కత్తితో దాడి చేసి, యాసిడ్ దాడి (Acid Attack) చేయడం కలకలం రేపుతోంది
- By Sudheer Published Date - 11:56 AM, Fri - 14 February 25

వాలెంటైన్ డే (Valentine’s Day) రోజున ఆంధ్రప్రదేశ్(AP)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యువతి పై కత్తితో దాడి చేసి, యాసిడ్ పోసాడు ఓ యువకుడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి, మదనపల్లెలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నది. అయితే ఆమెపై గణేష్ అనే యువకుడు కత్తితో దాడి చేసి, యాసిడ్ దాడి (Acid Attack) చేయడం కలకలం రేపుతోంది. తీవ్రంగా గాయపడిన గౌతమీ ని కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గౌతమికి ఇప్పటికే శ్రీకాంత్ అనే యువకుడితో వివాహ నిశ్చయమై, ఏప్రిల్ 29న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.
IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్‌లను ఇకపై ఉచితంగా చూడలేరు.. కారణమిదే?
ఈ విషయం తెలుసుకున్న గణేష్, తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి ముందు గౌతమి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన్ని గమనించిన గణేష్, నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. తర్వాత ఆమె మొహంపై యాసిడ్ పోశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.