Israel Vs Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్, ఎల్‌టీజీ హెర్జి హలేవీ సారథ్యంలో ఇజ్రాయెల్ (Israel Vs Iran) ఈ ప్రతీకార దాడులు చేసింది.
- By Pasha Published Date - 09:32 AM, Sat - 26 October 24

Israel Vs Iran : ఇవాళ తెల్లవారుజామున కొన్ని గంటల పాటు ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ సైనిక స్థావరాలతో పాటు క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులు జారవిడిచాయి. ఇరాన్ తయారు చేస్తున్న క్షిపణుల వల్ల తమ దేశ పౌరులకు తక్షణ ముప్పు పొంచి ఉన్నందున, వాటి తయారీ యూనిట్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ప్రస్తుతానికి ఇరాన్‌పై తమ దాడులు ముగిశాయని పేర్కొంది.
Also Read :Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారి పాస్‌పోర్టులు రద్దు!
అక్టోబరు 1న తమ దేశంపై దాడులు చేసినందుకు ప్రతీకారంగానే ఇరాన్‌పై ఈ ప్రతీకార దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు ఉందని తెలిపింది. తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఏదైనా చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ వెల్లడించారు. ఇజ్రాయెల్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్, ఎల్‌టీజీ హెర్జి హలేవీ సారథ్యంలో ఇజ్రాయెల్ (Israel Vs Iran) ఈ ప్రతీకార దాడులు చేసింది. ఈ దాడులను ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. ఈ దాడుల వల్ల తెహ్రాన్‌లో ఎంత నష్టం వాటిల్లింది అనే విషయం ఇంకా తెలియరాలేదు.
Also Read :Under Eye Mask : నల్లటి వలయాలను పోగొట్టుకోవాలంటే ఇంట్లోనే అండర్ ఐ మాస్క్ ను ఇలా తయారు చేసుకోండి
ఇజ్రాయెల్ దాడిపై ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ దాడుల అనంతరం అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. అయితే ఇరాన్‌పై దాడులు చేయబోతున్న అంశంపై అమెరికాకు ఇజ్రాయెల్ ముందే సమాచారాన్ని అందించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ దేశంలో విమానాల రాకపోకలను నిలిపివేసింది.