Gujarat: గుజరాత్‌లో దారుణం.. పసికందును బిల్డింగ్ పైనుంచి పడేసిన బాలిక
గుజరాత్ (Gujarat)లో దారుణం వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలిక తనకు పుట్టిన పసికందును భవనం రెండో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను ప్రశ్నించారు.
- By Gopichand Published Date - 08:59 AM, Wed - 14 December 22

గుజరాత్ (Gujarat)లో దారుణం వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలిక తనకు పుట్టిన పసికందును భవనం రెండో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను ప్రశ్నించారు. కాగా తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నసమయంలో ఇంటి దగ్గర నివసిస్తున్న స్నేహితుడు తనపై అత్యాచారం చేశాడని, అందువల్లే తనకు గర్భం వచ్చిందని బాలిక తెలిపింది. బాలిక వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి విచారిస్తున్నారు.