Himachal Pradesh : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ లో 100శాతం పోలింగ్..!!
- Author : hashtagu
Date : 12-11-2022 - 7:07 IST
Published By : Hashtagu Telugu Desk
హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 68స్థానాలకు గానూ పోలింగ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లాహౌల్ స్పితి జిల్లాలో వందశాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ నివాసం ఉంటున్న 52మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చరిత్ర క్రియేట్ చేసింది. ఎన్నికల సంఘం 15,256 అడుగుల ఎత్తుల అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్, కాజా గ్రామ ప్రజలు ఈ బూత్ లో ఓటు వేశారు.
అయితే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా పోలింగ్ బృందాన్నిబూత్ కు పంపించారు. ఈవీఎంలను కూడా హెలికాఫ్టర్ ద్వారా తీసుకుని వచ్చారు. తాషిగ్యాంగ్ లో వంద శాతం పోలింగ్ జరగడం పట్ల డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి అభిషేక్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు ఎత్తైన బూత్ కు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.