Rahul Gandhi : రాహుల్ దెబ్బకు ‘రామ్’ జతకమే మారిపోయింది
తాజాగా సుల్తాన్ పూర్‌లో పర్యటించిన ఆయన చెప్పులు కొట్టుకునే రామ్ చేత్ దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడడం..సమస్యల గురించి అడిగితెలుసుకోవడమే కాదు..అతడి పక్కన కూర్చుని చెప్పులు కొట్టాడు.
- Author : Sudheer
Date : 01-08-2024 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దెబ్బకు రామ్ (Ramchet) జతకమే మారిపోయింది. ఇంతకీ రామ్ ఎవరా అనుకుంటున్నారా..? గత కొద్దీ రోజులుగా రాహుల్ సామాన్య ప్రజల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడం..కష్టసుఖాలను తెలుసుకోవడం..వారితో కలిసి భోజనం చేయడం..ప్రయాణించడం ఇలా ఎన్నో చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సుల్తాన్ పూర్‌లో పర్యటించిన ఆయన చెప్పులు కొట్టుకునే రామ్ చేత్ దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడడం..సమస్యల గురించి అడిగితెలుసుకోవడమే కాదు..అతడి పక్కన కూర్చుని చెప్పులు (footwear ) కొట్టాడు. అది దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. రాహుల్ గురించే కాదు రామ్ గురించి కూడా అంత మాట్లాడుకోవడం..అరా తీయడం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో రామ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. రామ్ షాప్ నుండి వెళ్తున్న వారంతా కారు ఆపి మరీ, ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు. సెల్ఫీలు దిగుతూ..వాటిని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతే కాదు ఆరోజు రాహుల్ కుట్టిన షూస్ కి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. రాహుల్ దుకాణం వదిలి వెళ్ళిన వెంటనే రామ్ చేత్‌కు కాల్ వచ్చింది. అందులో ఆయన కుట్టిన షూస్ కావాలంటూ ఓ వ్యక్తి అడిగారు. దానిని తనకు రూ.5 లక్షలకు అమ్మాల్సిందిగా అడిగారట.. ఇంకొకరు అయితే ఏకంగా రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారట. మరొకరైతే.. ‘బ్యాగు నిండా డబ్బిస్తా.. ఇచ్చేయ్’ అన్నారట. కానీ ఎవ్వరు ఎంత ఇస్తామని చెప్పినా..ఎలా అడిగిన కూడా రామ్ చేత్ మాత్రం వాటిని ఇవ్వను అని తెగేసి చెపుతున్నాడట. రాహుల్ కు గుర్తుగా అది తన వెంట పెట్టుకుంటానని..ఎవరికీ ఇవ్వనని సమాధానం చెపుతున్నాడట. సో మొత్తం మీద రాహుల్ దెబ్బకు రామ్ దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
Read Also : Shouryuv : ఎన్టీఆర్ తో సినిమా – హాయ్ నాన్న డైరెక్టర్ క్లారిటీ