Shouryuv : ఎన్టీఆర్ తో సినిమా – హాయ్ నాన్న డైరెక్టర్ క్లారిటీ
'హాయ్ నాన్న' డైరెక్టర్ శౌర్యువ్ తో ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నాడనే..ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని , ఇప్పటికే కథ ఎన్టీఆర్ కు చెప్పడం..ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందంటూ
- By Sudheer Published Date - 09:06 PM, Thu - 1 August 24

“RRR” మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు కొత్త డైరెక్టర్లే కాదు సీనియర్ డైరెక్టర్లు కూడా పోటీ పడుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరి డైరెక్షన్లో చేస్తారనేది ఆసక్తి మారింది. ఈ క్రమంలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ శౌర్యువ్ తో ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నాడనే..ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని , ఇప్పటికే కథ ఎన్టీఆర్ కు చెప్పడం..ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందంటూ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వార్తల ఫై డైరెక్టర్ శౌర్యువ్ క్లారిటీ ఇచ్చారు. ‘ఇది నిజం కాదు. ఈ వదంతులు ఎలా మొదలయ్యాయో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు ఇది తప్పుడు సమాచారం. నిజం కావాలనే నేను కోరుకుంటున్నా. ఒకరోజు అది నిజమవుతుందని ఆశిద్దాం’ అని ఆయన చెప్పుకొచ్చారు. డైరెక్టర్ క్లారిటీ తో ఎన్టీఆర్ తో సినిమా లేదని అంత ఫిక్స్ అవొచ్చు.
Read Also : Olympic Games Paris 2024 : ప్రమాదానికి గురైన దీక్షా దాగర్..