Supplements for Women : ముప్పై దాటిన ఆడవాళ్లు ఈ సప్లిమెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి
ముప్పై ఏళ్లు దాటిన తర్వాత.. పురుషులలో, మహిళలో హార్మోన్లు (Hormones) క్షీణించడం ప్రారంభమవుతుంది.
- By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Thu - 12 January 23

ముప్పై ఏళ్లు దాటిన తర్వాత.. పురుషులలో, మహిళలో హార్మోన్లు క్షీణించడం ప్రారంభమవుతుంది. మహిళల్లో దాని ప్రభావం కారణంగా.. ఊబకాయం, లైంగిక కోరికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వయసులో.. హార్మోన్ మార్పుల వల్ల కలిగే పరిణామాలు తగ్గించడానికి, మహిళలు కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్లు (Supplements) తీసుకోవాలని ప్రముఖ హోమియోపతి వైద్యురాలు స్మితా భోయిర్ పాటిల్ అన్నారు. మహిళల్లో గర్భధారణ, నెలసరి వంటి కారణాల వల్ల.. మగవారి కంటే ఆడవారిలో శరీరక మార్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ముఫ్పై ఏళ్లు దాటిన తర్వాత.. మహిళల పీరియడ్స్ నియంత్రించే.. ఈస్ట్రోజన్ ఉత్పత్తి బాగా క్షీణీంచడం ప్రారంభమవుతుంది. 35, సంవత్సరాలు దాటిన తర్వాత.. గణనీయంగా పడిపోతుంది. మహిళల్లో దాని ప్రభావం కారణంగా.. ఊబకాయం, లైంగిక కోరికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వయసులో.. హార్మోన్ మార్పుల వల్ల కలిగే పరిణామాలు తగ్గించడానికి, మహిళలు కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలని ప్రముఖ హోమియోపతి వైద్యురాలు స్మితా భోయిర్ పాటిల్ అన్నారు.
ఈ సప్లిమెంట్లు హార్మన్, థైరాయిడ్ అసమతుల్యతలను సరిచేస్తాయని అన్నారు. సప్లిమెంట్స్ పీరియడ్స్, డెలివరీ వల్ల కలిగే రక్తహీనతను నిరోధించడానికి సహాయపడతాయని వివరించారు. ఒత్తిడి, బర్త్ కంట్రోల్ పిల్స్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను ఈ సప్లిమెంట్స్ (Supplements) నిరోధిస్తాయి.
సప్లిమెంట్స్ (Supplements):
విటమిన్ B (Vitamin B):
మెగ్నీషియం మన శరీరానికి ఎంతో ముఖ్యమైన ఖనిజం. మన బాడీ.. 300 కంటే ఎక్కువ శారీరక ప్రక్రియలకు కోఫాక్టర్‌గా మెగ్నీషియంపై ఆధారపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్న వ్యక్తులు కండరాల తిమ్మిరి, , అలసట, మానసిక రుగ్మతలు, హైపర్‌టెన్షన్, వికారం, కండాల బలహీనత వంటి సమస్యలతో బాధపడతారు. మన శరీరానికి ప్రతి రోజు 320-400 mg మెగ్నీషియం అవసరం.
Also Read: Blood Group : హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో బ్లడ్ గ్రూప్ చూసి చెప్పేయొచ్చా..?