Blood Group : హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో బ్లడ్ గ్రూప్ చూసి చెప్పేయొచ్చా..?
60 ఏళ్లలోపు స్ట్రోక్ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది..? బ్లడ్ గ్రూపు ఆధారంగా చెప్పొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బృందం అంటోంది.
- Author : Maheswara Rao Nadella
Date : 12-01-2023 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
60 ఏళ్లలోపు స్ట్రోక్ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది..? బ్లడ్ గ్రూప్ (Blood Group) ఆధారంగా చెప్పొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బృందం అంటోంది. వీరు చేసిన పరిశోధన ఫలితాలు జర్నల్ న్యూరాలజీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. O బ్లడ్ గ్రూప్ (Blood Group) వారికి వృద్ధాప్యానికి ముందే స్ట్రోక్ రిస్క్ ఉంటుందని గతంలోనే వెల్లడి .జన్యుపరమైన ముందస్తు స్ట్రోక్ రిస్క్ A బ్లడ్ గ్రూప్, O బ్లడ్ గ్రూప్ వారికి ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ తరహా జన్యువులు ఉండే వారిలో బ్లడ్ క్లాట్ ఏర్పడి స్ట్రోక్ కు కారణం అవుతున్నాయి’’ అని డాక్టర్ మిచెల్ తెలిపారు. ఇస్చెమిక్ స్ట్రోక్, జన్యువులపై నార్త్ అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా జరిగిన 48 అధ్యయన ఫలితాలను ఈ బృందం విశ్లేషించింది. 60 ఏళ్లలోపు స్ట్రోక్ వస్తే దాన్ని ఇస్చెమిక్ స్ట్రోక్ గా చెబుతారు. A బ్లడ్ గ్రూప్ వారికి ముందుగా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుందట. ఇక O బ్లడ్ గ్రూప్ వారికి 60 ఏళ్ల తర్వాత స్ట్రోక్ రావడం చాలా తక్కువని గుర్తించారు. B బ్లడ్ గ్రూప్ వారికి 60 ఏళ్లలోపు, తర్వాత కూడా వచ్చే అవకాశాలుంటాయి.
Also Read: Swami Vivekananda : స్వామి వివేకానందను ఆహ్వానించడానికి జైపూర్ రాజు ఒక వేశ్యను పిలిస్తే..