Orange: ఈ సమస్య ఉన్నవాళ్లు కమలా పండు తింటే ఇక అంతే సంగతులు.. డేంజర్ లో పడ్డట్టే!
కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కమలా పండ్లను తినకపోవడమే మంచిదని, అలా కాదని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:34 AM, Sat - 14 December 24

కమలా పండు వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా లభిస్తు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తియ్యగా, పుల్లగా ఉంటే ఈ కమలా పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. కమలా పండులో విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి బాధపడతారు. చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండదు. దీంతో శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందదు. అదే కమలా పండు తింటే విటమిన్ అందుతుంది.
ఈ పండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కమలా పండుతో ఉన్నాయి. అయితే, కమలా పండును కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదట. మరి కమల పండు ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ సీజన్ లో జలుబు, దగ్గు సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే జలుబు దగ్గు సమస్యలు లేని వారు చక్కగా కమలా పనులను తినవచ్చట. ఒకవేళ ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కమలా పండ్లను తినక పోవడమే మంచిది అని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల జలుబు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా పొడి దగ్గు ఉన్నవారు వీటి జోలికి పోకపోవడమే మంచిదట. వీరు తింటే ఉన్న దగ్గు కాస్తా తీవ్రమవుతుందట.
ఆ తర్వాత ఊపిరాడకుండా దగ్గు వస్తుందట. అంతేకాకుండా జలుబు, దగ్గు ఉన్నవారు కమలా పండ్లు తినడం వల్ల గొంతునొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కమలా పండ్లు బాగున్నాయి కదా అని ఎక్కువగా తింటే మాత్రం జీర్ణ సమస్యలు వస్తాయట. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు కమలాపండు తినకపోవడమే మంచిది. వీటిని ఎక్కువగా తింటే జీర్ణశక్తి ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే పొత్తికడుపు తిమ్మిరి ఉబ్బరం కడుపునొప్పి అతి సారానికి దారి తీయవచ్చని చెబుతున్నారు. ఈ పండు ఎక్కువగా తిన్నా వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లు తినకూడదట. కమలా పండ్లు తక్కువ మోతాదులో తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదట. ఎక్కువ తింటేనే అసలు సమస్య వస్తుందట. కమలా పండ్లలో కేలరీలు ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల ఆ కేలరీలతో కలిపి అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందట.
అందుకే బరువు తగ్గాలనుకునేవారు కమలా పండ్లను ఎక్కువ మోతాదులో తినకూడదని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు కూడా కమలా పండ్లు ఎక్కువగా తినకూడదు. యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్న వ్యక్తులు కమలాలను అధికంగా తినడం వల్ల గుండె మంట సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను ఎక్కువగా తినకూడదట.
కొందరు అలర్జీ, శ్వాసకోస వ్యాధులతో బాధపడతారు. అలాంటి వారు కమలా పండ్లు తినడం తగ్గించుకోవాలి. ఈ పండ్లను ఎక్కువ తినడం వల్ల ఇలాంటి వారికి అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. చర్మంపై ఎర్రటి మచ్చలు, మంట, దద్ధుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.