Tea : టీ తాగకూడని సందర్భాలు వాటిని చూశాక వెంటనే టీ మనస్తారు..!
- By Vamsi Chowdary Korata Published Date - 03:10 PM, Sat - 25 October 25
టీ తాగకూడని ముఖ్య సందర్భాలు
టీ (Tea) తాగడం మనలో చాలామందికి అలవాటు. ఉదయం లేచిన వెంటనే, లేదా సాయంత్రం విశ్రాంతికి టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంది. ఒత్తిడి తగ్గించడానికి లేదా అలసట నుంచి రిలాక్స్ అవ్వడానికి టీ తాగడం మంచిది, కానీ కొన్ని సందర్భాల్లో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీ తాగకూడని సందర్భాలు:
చల్లటి పానీయాలు లేదా ఆహార పదార్థాల తర్వాత:
చల్లటి డ్రింక్స్, చల్లని ఆహారాన్ని తిన్న వెంటనే టీ తాగితే శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారి జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది.
నిమ్మరసం (Lemon Juice) తర్వాత:
నిమ్మరసం మరియు టీలోని రసాయనాలు కలవడం వల్ల అసిడిటీ (Acidity) సమస్యలు, కడుపులో మంట, ఛాతీలో నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు.
భోజనం తర్వాత:
అన్నం, కూరలు, రొటీన్ భోజనం తర్వాత వెంటనే టీ తాగడం Iron వంటి ముఖ్యమైన పోషకాలను శోషించకుండా అడ్డుకుంటుంది. ఇది రక్తపోటు (Blood Pressure) సమస్యలకు దారితీయవచ్చు.
జీర్ణం కష్టమైన ఆహారాల తర్వాత:
అట్లు, దోశలు, శెనగపిండి (Besan) వంటి ఆహార పదార్థాలు తిన్న తర్వాత టీ తాగడం జీర్ణవ్యవస్థ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది.