Ugadi Pachadi: ఉగాది పచ్చడి తింటే పుణ్యమే కాదు ఆరోగ్యం కూడా..!!
తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు వగరలు ఈ షడ్రుచుల మిశ్రమమే ఉగాది పచ్చడి. కానీ అందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం గురించి ఎంతమందికి తెలుసు. మన పెద్దలు ప్రయోజనం లేకండా ఏదీ చెయ్యరన్నది వాస్తవం. వారు చెప్పిన మాటలు, చూపిన బాటలు అన్నింటిలోనూ అర్థం ఉంటుంది.
- By Hashtag U Published Date - 03:50 PM, Fri - 1 April 22

తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు వగరలు ఈ షడ్రుచుల మిశ్రమమే ఉగాది పచ్చడి. కానీ అందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం గురించి ఎంతమందికి తెలుసు. మన పెద్దలు ప్రయోజనం లేకండా ఏదీ చెయ్యరన్నది వాస్తవం. వారు చెప్పిన మాటలు, చూపిన బాటలు అన్నింటిలోనూ అర్థం ఉంటుంది. ఆరోగ్యవంతమైన రహస్యం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఉగాది పచ్చడిలోనూ ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగిఉన్నాయి.
ఉగాది పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు..
కొత్త చింతపండు, లేతమామిడి చిగుళ్లు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, జీలకర్రలాంటివి ఉగాది రోజు తినే పచ్చడిలో ఉపయోగిస్తారు. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద శాస్త్రం మొదట్నుంచీ చెప్తూనే ఉంది. ఈ పచ్చడిని ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే..ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఉగాది పచ్చడిలో మరో పరమార్థం కూడా దాగి ఉంది. ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్ష సంరక్షణ అవసరాన్ని ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని వివరిస్తుంది. బుుతు మార్పుల కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఓ ఔషదంలా ఉగాది పచ్చడిని తినే ఆచారం ప్రారంభమైంది. శ్రీరామ నవమి వరకు ఈ పచ్చడిని తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
పచ్చడిలో ఉపయోగించాల్సి పదార్థాలు..:
వేపపువ్వు, చిన్న చెరుకు ముక్క, కొబ్బరి ముక్క, అరటిపళ్లు, చింతపండు, మామిడికాయ, బెల్లం, ఉప్పు, నీళ్లు, జీలకర్ర
తయారీ విధానం:
ముందుగా చెరుకు, కొబ్బరి, బెల్లం, మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకుల్ని తీయాలి. తగినన్ని నీల్లలో చింతపండును బాగా కలిపి వడకట్టాలి. పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలో పోయాలి. దానిలో బెల్లం తురుము వేసి కలపాలి. తర్వాత చిటికెడు ఉప్పు, చెరుకు, కొబ్బరి, మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. చివరికి అరటిపండు ముక్కలు వేయాలి. అంతే..షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ.