Face Packs: సమ్మర్ లో అందంగా మెరిసి పోవాలంటే ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయాల్సిందే!
వేసవికాలంలో కూడా మీ అందం చెక్కుచెదరకుండా అలాగే ఉండాలి అంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాల్సిందే అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:19 PM, Sat - 22 March 25

ఆరోగ్య సమస్యలతో పాటు అందానికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఎండలకు చర్మం ఎక్కువగా దెబ్బతింటూ ఉంటుంది. ఆ చర్మం పాడవ్వకుండా ఉండాలంటే కొన్ని ఫ్రూట్ ఫేషియల్స్ ని ప్రయత్నించవచ్చని చెబుతున్నారు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు,సహజ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే ఈ పండు మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందట. ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ లు ఏవి? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..
బొప్పాయి, తేనె.. బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముందుగా బొప్పాయిని తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి అందులో ఆర్గానిక్ తేనెను కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సమానంగా అప్లై చేసి పది నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ విధంగా చేయడం ముఖంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. మీ చర్మం తాజాగా కనిపిస్తుంది.
అలాగే కివీ, అవకాడో ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిలోనూ చర్మానికి అద్భుతాలు చేసే గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి ఉన్నాయి. కివి, అవకాడో గుజ్జును తీసుకొని ఈ మిశ్రమానికి తేనెను కలిపి ముఖం,మెడపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ప్యాక్ ని తొలగించాలి. చల్లటి నీటితో తొలగించాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారుతుందట. డల్ నెస్ తొలగిపోతుందట.
మామిడి, పెరుగు ఫేస్ ప్యాక్.. కూడా ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుందట. మామిడి పండును పెరుగులో మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మొటిమల సమస్య తొలగిపోతుందట. పండిన మామిడిపండు గుజ్జులో కొంచెం పెరుగు కలిపి నేరుగా ముఖానికి అప్లై చేయాలని ఇది ముఖంపై ఉండే మురికిని కూడా తొలగిస్తుందని, చరణం పై ఉండే రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుందని చెబుతున్నారు.
అదేవిధంగా తేనే అరటిపండు మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుందట. ఇందుకోసం బాగా పండిన అరటిపండు,అర చెంచా తేనె, చెంచా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై సమానంగా అప్లై చేయాలి. ఆ తర్వాత ఆరిపోయే వరకు ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఈ విధమైన ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తే ఎండాకాలంలో కూడా నిగనిగలాడే అందం కూడా మీ సొంతం అవుతుందని చెబుతున్నారు.