HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Treating Breast Cancer With Bee Venom

Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

  • Author : Vamsi Chowdary Korata Date : 07-05-2026 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Treating Breast Cancer with Bee Venom?
Treating Breast Cancer with Bee Venom?

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందరినో వేధిస్తోంది. ఈ క్యాన్సర్ రక్కసి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ను నివారించేందుకు ఎన్నో రకాల ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ దశను బట్టి చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ను మాన్పించడానికి తేనెటీగలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ కణాలను నాశనం చేసి ఇతర కణాలకు హాని కలిగించకుండా ఉంచే ఔషధ శక్తి తేనెటీగల్లో ఉందని గుర్తించారు. తేనెటీగల విషం నుంచి తీసిన ద్రవంలో క్యాన్సర్ను నయం చేసే శక్తి ఉందని ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. మూడు వందలకు పైగా తేనెటీగల నుంచి విషాన్ని సేకరించి ఈ ప్రయోగం చేసినట్లు వెల్లడించారు.

అయితే ఈ విషంలో ట్రిపుల్ నెగెటివ్ హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు రొమ్ము క్యాన్సర్ను బాగు చేసే గుణాలు కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు. తేనెటీగల్లోని విషంతో కూడిన సమ్మేళనాన్ని రొమ్ము క్యాన్సర్ బాధితుల శరీరంలో ప్రవేశపెట్టిన తర్వాత గంటసేపటికి రియాక్షన్ ఉంటుంది. గంట తర్వాత క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే క్యాన్సర్ స్టేజీలను బట్టి ఈ చికిత్స ఉంటుందని చెబుతున్నారు. కీమోథెరపీ విధానంతో పాటు దీన్ని అనుసరించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పరీక్షలు ఇంకా ల్యాబ్ దశలోనే ఉన్నాయని వెల్లడించారు. ఈ విషంతో క్యాన్సర్కు అడ్డుకట్ట వేయవచ్చని ఈ టెస్టుల్లో తేలిందన్నారు. అయితే ఈ సమ్మేళనాన్ని కృత్రిమంగా కూడా సృష్టించవచ్చని చెబుతున్నారు. తేనెటీగల విషంతో క్యాన్సర్ చికిత్స పూర్తిస్థాయిలో జరగాలంటే ఇంకొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ కణాల సిగ్నలింగ్, పునరుత్పత్తి వంటి వాటిని ఈ విషం అడ్డుకుంటుందని, దీంతో క్యాన్సర్ నుంచి ఉపశమనం కలుగుతుందని గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని, ఇంకా చికిత్స అందుబాటులోకి రావాలంటే మరికొన్ని ఏళ్లు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Breast Cancer
  • Breast Cancer Causes
  • breast cancer drug
  • Breast Cancer In India
  • health benefits
  • health care
  • honey bee
  • Honey Bees

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd