Heatwave: వేసవిలో ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్ డ్రింక్ ఇది..!
- Author : Vamsi Chowdary Korata
Date : 27-03-2026 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
Summer Drinks రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో వేసవి తాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సీజన్‌లో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతల పానీయాల వైపు మొగ్గు చూపే బదులు, సహజ సిద్ధంగా లభించే పానీయాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చల్లదనం కూడా లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని అందించడంలో సహజ పానీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొబ్బరి నీరు. ఇందులో సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండి, శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తుంది. అలాగే, విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచి వడదెబ్బ నుంచి కాపాడుతుంది.
శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో చెరుకు రసానికి సాటి లేదు. ఇది అలసటను తగ్గించి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక సహజ ప్రోబయోటిక్ అయిన మజ్జిగ జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. సంప్రదాయ పానీయమైన రాగి జావ ఎముకలకు బలాన్నిస్తూ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
అధిక నీటిశాతం ఉండే పుచ్చకాయ జ్యూస్ శరీరానికి తక్షణ హైడ్రేషన్ అందించి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కాబట్టి ఈ వేసవిలో కృత్రిమ పానీయాలకు బదులుగా సహజంగా లభించే ఈ డ్రింక్స్‌ను డైట్‌లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.
అన్నింటికీ మించి.. వేసవిలో మంచినీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. చెమట రూపంలో బయటికిపోయే ద్రవాలను భర్తీ చేయడంలో నీటిది కీలకపాత్ర.
Tags
- benefits of buttermilk
- Benefits Of Coconut Water
- buttermilk
- coconut water
- dehydration
- dehydration problem
- Dehydration Symptoms
- Healthy Summer Drinks
- heatwave
- Heatwave alert
- Heatwave in AP
- Heatwave in India
- Heatwave in Telangana
- Lemon Juice
- lemon juice benefits
- Ragi Java
- ragi java benefits
- Refreshing Summer Drinks
- Sugarcane juice
- Sugarcane Juice Benefits
- Summer Drinks
- watermelon juice