HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >This Diet Plan Is For Staying Healthy In Winter

Winter Diet Plan : శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ డైట్ ప్లాన్

శీతాకాలంలో జీర్ణవ్యవస్థ (Digestive System) కూడా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే కడుపు సక్రమంగా పనిచేస్తుందో

  • Author : Maheswara Rao Nadella Date : 28-12-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dietary Guideline
Dietary Guideline

వింటర్ (Winter) సీజన్ రొమాంటిక్ గా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. శీతాకాలంలో జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే కడుపు సక్రమంగా పనిచేస్తుందో అప్పుడే తిండి కూడా బాగా తినాలని అనిపించడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. అయితే వింటర్ (Winter) సీజన్ లో హెవీ, ఆయిల్, స్పైసీ ఫుడ్ ను విస్మరించడం మంచిది. దీనితో పాటు ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. శీతాకాలంలో ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

▶ ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని ఉదయాన్నే తీసుకుంటే, ఆ రోజంతా చక్కగా సాగుతుంది. శీతాకాలంలో గుడ్డు, బ్రౌన్ బ్రెడ్ శాండ్‌విచ్, ఉప్మా, దోసె, ఇడ్లీ వంటి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకోవాలి.

▶ మీకు కావాలంటే, మీరు అల్పాహారంలో కూరగాయల లేదా ఫ్రూట్ సలాడ్ తినవచ్చు. చలికాలంలో అల్పాహారం తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. బ్రేక్ పాస్ట్ తర్వాత వేడి పాలు తాగడం వల్ల యాక్టివ్‌గా ఉంటారు.

▶ శీతాకాలంలో, మీరు పచ్చి కూరగాయలు, రోటీ, తాజా పెరుగు లేదా మజ్జిగ, పొట్టు తీసిన పప్పుతో అన్నం, మధ్యాహ్న భోజనంలో వేడి వేడి సూప్ తీసుకోవచ్చు. విటమిన్ సి , ప్రోటీన్లు కూరగాయలలో పుష్కలంగా లభిస్తాయి, కాబట్టి అవి ఆరోగ్యానికి ఉత్తమమైనవి.

▶ చలికాలంలో వేరుశెనగలు, బాదంపప్పులను తప్పనిసరిగా తీసుకోవాలి, ఎందుకంటే వేరుశెనగలో ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి.

▶ చలికాలంలో శెనగపిండి, దేశవాళీ బెల్లం తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. రక్తం స్థాయి పెరుగుతుంది. బెల్లం వల్ల అనీమియా నుంచి కూడా దూరమవ్వచ్చు. అందుకే బెల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

▶ శీతాకాలంలో రాత్రిపూట తొందరగా ఆహారం తీసుకోవాలి. అంతేకాదు, ఈ సీజన్లో డిన్నర్ లైట్ తీసుకోవడం మంచిది. మీరు డిన్నర్‌లో ఏదైనా గ్రీన్ వెజిటేబుల్, రోటీ, చట్నీ, సలాడ్‌ని చేర్చుకోవచ్చు. ఎందుకంటే రాత్రి సమయంలో డైజేషన్ సీస్టం డౌన్లో ఉంటుందని తెలుసు కదా..

▶ శీతాకాలంలో నిద్రించే ముందు, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు, కరుక్కాయా లేదా అల్లం కలిపి తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని తక్కువ అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ఇది ఎంతో అవసరం.

Also Read:  South India : అన్నం వడ్డించడానికి అరటి ఆకును ఎందుకు వాడుతారో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • food
  • Habits
  • health
  • Life Style
  • winter

Related News

Here is how you can tell if someone truly loves you!

True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

True Love: ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టే లేదా మీకు నచ్చనిది ఏమీ చేయరు. నిజమైన ప్రేమగల (True Love) వ్యక్తి మీ కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెతుకుతాడు. అతను ఎంత బిజీగా ఉన్నప్పటిక

  • 7 Tips to Curb Insomnia for Stress Management

    Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd