Blood Purification: ఈ ఆయుర్వేద మూలికలతో రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు..
రక్తంలో వ్యర్థాలను క్లీన్ చేయండం చాలా ముఖ్యం. రక్తాన్ని శుద్ధి చేసే కొన్ని మూలికలను ఆయుర్వేద డాక్టర్ జికె తారా జయశ్రీ MD (Ayu) మనకు షేర్ చేశారు.
- By Maheswara Rao Nadella Published Date - 05:00 PM, Fri - 10 March 23

మన శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. రక్తం (Blood) మన ఒంట్లోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను, పోషకాలను అందిస్తుంది. కణాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రొజువారీ వ్యవహారాల్లో భాగంగా దెబ్బతినే కణజాలాను రక్తమే రిపేర్ చేస్తుంది. అనారోగ్యకరమైన లైఫ్‌స్టైల్, ఆహారంలో ఉండే వ్యర్థ పదార్థాల కారణంగా రక్తంలో మలినాలు చేరతాయి. రక్తం (Blood) లో వ్యర్థాలు ఎక్కువైతే.. అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, అలర్జీలు, దురదలు వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి రక్తశుద్ధి తప్పనిసరి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి.. రక్తంలో వ్యర్థాలు లేకుండా ఉండటం చాలా అవసరం. రక్తాన్ని శుద్ధి చేసే కొన్ని మూలికల గురించి ఆయుర్వేద డాక్టర్ జికె తారా జయశ్రీ MD (Ayu) మనకు వివరించారు.
వేప:
మంజిష్ఠ:
తిప్పతీగ:
తిప్పతీగ మూడు దోషాలను సమతుల్యం చేసే శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. ఇది రక్తం శుద్ధి చేయడంలోనూ.. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. తిప్పతీగ రక్తం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. హైపోగ్లైసీమిక్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఇది ప్యాంక్రియనా నుంచి ఇన్సులిన్ స్రావం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. తిప్పతీగ పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే మంచిది.
ఉసిరి:
తులసి:
పసుపు:
పసుపులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయ. ఇది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలోని అనేక సమస్యలతో పోరాడటంలో సహాయపడుతుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. ఈ పాలు రక్తాన్ని క్లీన్ చేస్తాయి.
Also Read: Artificial Intelligence: అసలుకు ఎసరు – AI మింగేసే జాబ్స్ ఇవే..

Related News

Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?
8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.