Pregnant Ladies: గర్భంతో ఉన్న స్త్రీలు ఆహారంలో ఎలాంటి పదార్థాలను చేర్చుకోవాలో మీకు తెలుసా?
స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:00 PM, Wed - 21 May 25

మామూలుగా స్త్రీలకు తల్లి అవ్వడం అన్నది గొప్ప వరం అని చెప్పాలి. అయితే అందరికీ ఆ భాగ్యం ఉండదు అని చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో చాలామంది సంతానాలు ఏమి సమస్యతో బాధపడుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు చాలా రకాల విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తల్లితోపాటు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అందుకే వైద్యుల సలహా మేరకు మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను తప్పనిసరిగా డైట్లో చేర్చుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భం దాల్చిన మహిళలు తమ ఆహారంలో భాగంగా ఐరన్, కాల్షియం, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, అయోడిన్, డిహెచ్ఏ వంటి ఆరు పోషకాలు తప్పకుండా తీసుకోవాలట. ఈ ఆరు పోషకాలు అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండవచ్చట. పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చని ఆకుకూరలను కూడా ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా ఆహార పదార్థాలతో పాటు ఈ పోషక విలువలను టాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు,ఇలా ఈ సమస్యతో బాధపడే వారిలో బిడ్డ ఎదుగుదల ఆగిపోతుందట. అందుకే ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి వీటితో పాటు క్యాల్షియం కూడా అధికంగా ఉండడం చేత బిడ్డ ఎదుగుదలకు అలాగే బిడ్డ శరీరంలోని ఎముకలు దృఢత్వానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా పాలు పాల పదార్థాలతో పాటు ప్రోటీన్లు సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఏది పడితే అది తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు.