Guava: ఈ సమస్యలు ఉన్నవారు జామపండుకు దూరంగా ఉండటం మంచిది!
ఇటీవలే ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నవారు లేదా తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారు పచ్చి జామపండు తినడం ప్రమాదకరం కావచ్చు.
- Author : Gopichand
Date : 22-09-2025 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
Guava: చాలామంది తమ ఆరోగ్యం, జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి రోజూ పండ్లు, కూరగాయలు తింటుంటారు. ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఒక పండు కొంతమందికి హానికరం అని మీకు తెలుసా? ముఖ్యంగా నాలుగు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పండు (Guava) చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. ఆ పండు ఏంటి, ఎవరు దానిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
జామపండు సైడ్ ఎఫెక్ట్స్
అజీర్ణంతో బాధపడేవారు
మీకు తరచుగా అజీర్ణం లేదా ఎసిడిటీ సమస్యలు ఉంటే జామపండు తినకుండా ఉండటం మంచిది. జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను పెంచుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తిన్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) రోగులు
IBS సమస్య ఉన్నవారికి తరచుగా విరేచనాలు, కడుపు నొప్పి లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉంటాయి. జామపండులో ఉండే ఫైబర్, గింజలు ఈ లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి. దీంతో కడుపులో నొప్పి, మంట పెరగవచ్చు. అంతేకాకుండా విరేచనాలు కూడా కావొచ్చు.
Also Read: Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు!
జలుబు లేదా సైనస్ సమస్యలు ఉన్నవారు
సైనస్ లేదా తరచుగా జలుబు, దగ్గు సమస్యలు ఉన్నవారు చలికాలంలో జామపండు తినకపోవడం మంచిది. జామపండు తింటే కఫం పెరుగుతుందని, గొంతు నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు
ఇటీవలే ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నవారు లేదా తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారు పచ్చి జామపండు తినడం ప్రమాదకరం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో వైద్యుడి సలహా లేకుండా దీనిని తినకూడదు.
Note: ఆరోగ్య నిపుణులు తెలిపిన ఈ సూచనలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, జామపండు తినే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి.