HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Symptoms You Might Experience A Month Before A Heart Attack

Heart Attack Symptoms: గుండెపోటు వ‌చ్చే ముందు క‌నిపించే సంకేతాలివే..!

ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు (Heart Attack Symptoms) బారిన‌ప‌డుతున్నారు.

  • Author : Gopi Date : 10-07-2024 - 8:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heart Attack
Heart Attack

Heart Attack Symptoms: ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు (Heart Attack Symptoms) బారిన‌ప‌డుతున్నారు. దీంతో ప్రజలు కోలుకునే అవకాశం కూడా లేని పరిస్థితి నెల‌కొంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు అకస్మాత్తుగా వచ్చి మరణానికి దారి తీస్తుందని భావించే వారు మన మధ్య చాలా మంది ఉన్నారు. కాబట్టి దాని గురించి సరైన సమాచారం ఉండాలి. తద్వారా గుండెపోటు నుంచి మ‌న‌ల్ని మ‌నం రక్షించవచ్చు. మీరు గుండెపోటుకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం గుండెపోటుకు ఒక వారం ముందు కొన్ని సంకేతాలను చూపుతుంది. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు

ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం

ఎక్కువ‌గా ఛాతీ నొప్పి ఒత్తిడికి గురికావ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఈ ఛాతీ నొప్పిని ఎక్కడైనా అనుభవించవచ్చు. కానీ సాధారణంగా ఇది ఎడమ వైపున అనిపించవచ్చు. ఈ నొప్పి మీ ఎడమ చేయి, భుజం, దవడ లేదా నడుముకు కూడా వ్యాపిస్తుంది.

Also Read: Unnao Road Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 18 మంది మృతి, 30 మందికి గాయాలు..!

శ్వాస ఆడకపోవటం

మీరు అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తే ముఖ్యంగా ఛాతీ నొప్పితో పాటుగా ఉంటే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

అలసిపోవ‌టం

గుండెపోటుకు ముందు మీరు చాలా అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కూడా ఈ అలసట రావచ్చు.

తలతిరగడం

గుండెపోటుకు ముందు మైకము, విచిత్రమైన చంచల భావన సంభవించవచ్చు. మీ రక్తపోటు తగ్గడం వల్ల కూడా ఇది జరుగుతుంది. కాబట్టి మీ బీపీని చెక్ చేసుకోండి.

వికారం లేదా వాంతులు

గుండెపోటుకు ముందు వికారం లేదా వాంతులు కూడా సంభవించవచ్చు. ఇది బలహీనమైన అనుభూతికి దారితీయవచ్చు. మీరు నిరంతరం అజీర్ణం వంటి సమస్యలను కలిగి ఉండవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

చెమట

గుండెపోటుకు ముందు అకస్మాత్తుగా చెమట సంభవించవచ్చు. ఎటువంటి కారణం లేకుండా మీకు బాగా చెమటలు పట్టవచ్చు. ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

ఈ చిట్కాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి

  • ధూమపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ధూమపానం గుండె జబ్బులు, గుండెపోటుకు ప్రధాన ప్రమాద కారకం.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఇందులో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ప్రోటీన్లు ఉంటాయి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉదయం, సాయంత్రం అరగంట పాటు యోగా, వ్యాయామం చేయాలి.
  • మీ బరువుపై శ్ర‌ద్ధ తీసుకోండి. ఎందుకంటే బరువు పెరగడం కూడా మీకు సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, బరువు పెరగకుండా డైట్ ఫాలో కావాలి.
  • అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రమాద కారకాలు. అందువల్ల సమయానికి వైద్యుడిని సంప్రదించండి. అంతేకాకుండా ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని  ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Health News
  • Health Tips Telugu
  • heart attack
  • Heart Attack Symptoms
  • lifestyle
  • symptoms

Related News

Survey on Physical Relationships... Shocking Details Revealed!

Physical Relations: శారీరక సంబంధాలపై సర్వే.. షాకింగ్ విషయాలు వెల్లడి!

భారతదేశంలో శారీరక సంబంధాల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. కానీ చాలా మంది రహస్యంగా చదవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించి నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శారీర‌క జీవితాలు (Survey On Physical Relations) బయటపడ్డాయి. ఇండియానా యూనివర్శిటీకి చెందిన కిన్సే ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక నివేదికను సిద

    Latest News

    • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

    • NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

    • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

    • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

    • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd