Stomach Ulcers : స్టమక్ అల్సర్స్ లక్షణాలు.. కారణాలు..!
Stomach Ulcers చర్మం మీద వచ్చే పుండ్లను మనం బయట నుంచి చూస్తుంటాం కాబట్టి దాని తీవ్రత ఎంత అది ఎంత వరకు
- By Ramesh Published Date - 08:38 PM, Fri - 22 September 23

Stomach Ulcers చర్మం మీద వచ్చే పుండ్లను మనం బయట నుంచి చూస్తుంటాం కాబట్టి దాని తీవ్రత ఎంత అది ఎంత వరకు తగ్గింది అన్నది గమనించవచ్చు. కానీ కడుపులో ఏర్పడ్డ పుడ్ల గురించి ఎలా తెలుసుకుంటాం. అసలు కడుపులో పుడ్న్లు లేదా పూత ఎలా తయారవుతుంది. అవి తీవరతం అయినప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది లాంటివి చూస్తే కడుపులో అల్సర్స్ వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. కడుపు, డ్యూడెనం, అన్నవాహిక ఇలా అల్సర్స్ రకరకాలుగా వస్తుంటాయి.
కడుపులో ఉండే పుండ్ల వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటమే కాకుండ గుండెల్లో మంట వికారం లాంటివి అనిపిస్తాయి. అప్పుడప్పుడు కడుపు నొప్పి కూడా వస్తుంది. కడుపులో అల్సర్స్ (Stomach Ulcers ) వల్ల ఇవి జరుగుతుంటాయి. హెలికోబాక్టర్ ఫైలోరి అనే ఇన్ ఫెక్షన్ కడుపు లేదా ప్రేగు గోడలపై దాడి చేస్తుంది. అదే అల్సర్స్ కింద మారుతుంది. ఈ అల్సర్స్ ప్రేగు రక్షిత వ్యవస్థను దెబ్బ తీస్తుంది.
అల్కహాల్ మరియు పొగ త్రాగే వారికి అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అతిగా మద్యం సేవించడం వల్ల పేగుల గోడలు దెబ్బతింటాయి. పొగ త్రాగడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అల్కహాల్ తాగడం వల్ల కడుపులో ఆంలాల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. అందువల్ల ప్రేగు పూత ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా కడుపులో అల్సర్స్ కి కారణం అవుతుంది.
ఇవే కాకుండా జన్యుపరంగా కూడా అల్సర్స్ వస్తాయి. తాతల తండ్రులకు అల్సర్స్ ఉంటే అవి తర్వాత తరం వారికి వచ్చే అవకాశం ఉంటుంది. అల్సర్స్ తీవ్రత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే సంబంధిత డాక్టర్ ని సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవడం మంచిది అల్సర్స్ తీవ్రతరం అవడం వల్ల అనుకోని సమస్యలు ఎదురవుతాయి.
Also Read : Natural Face pack : నిమిషాల్లో అద్భుతంగా మెరవండి.. 5 మినిట్స్ పేస్ ప్యాక్ తెలుసా..?