Natural Face pack : నిమిషాల్లో అద్భుతంగా మెరవండి.. 5 మినిట్స్ పేస్ ప్యాక్ తెలుసా..?
Natural Face pack మెరిసే చర్మ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే తమ ముఖాన్ని కాంతివంతంగా
- By Ramesh Published Date - 08:16 PM, Fri - 22 September 23

Natural Face pack మెరిసే చర్మ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే తమ ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఆడవారి ముఖ సౌందర్యానికి మార్కెట్ లో చాలా రకాల కాస్మొటిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్ అంటే చాలు అద్దానికి అతుక్కుపోయి అందంగా రెడీ అయ్యేందుకు గంటల కొద్దీ టైం కేటాయిస్తారు. కొందరు ఇంట్లో కష్టమని పార్లర్లకు వెళ్లడం కూడా జరుగుతుంది.
బ్యూటీ పార్లర్ కు వెళ్లడం వల్ల మెరిసే చర్మం వస్తుందని అనుకుంటారు కానీ అక్కడ వాడే కెమికల్స్ మిక్సెడ్ కాస్మొటిక్స్ వల్ల అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొందరు ఈ క్రీములను వాడకుండా సహజ సిద్ధంగా తయారు చేసుకున్న వాడిని వాడుతారు. ముఖం కాంతివంతంగా మెరిసేందుకు కొన్ని అలవాట్లు మార్చోవాలి దాని కోసం కొన్నిటిని మాపు చేసుకోవాలి.
కేవలం ఐదు నిమిషాల్లో మెరిసే చర్మాన్ని తయారు చేసుకోవచ్చు. అది కూడ సహజ సిద్ధంగానే ఐదు నిమిషాల ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంతకీ ఈ ఫేస్ ప్యాక్ కోసం ఏమేమి వాడుతారు అంటే రోజ్ వాటర్, టమాటా, అలోవెరా జెల్ ఇంకా ముల్తానీ మట్టి వాడతారు.
చర్మ లో.. ముఖం మీద మృత కణాలను శుబ్రపరచుకుని ఆ తర్వాత రోజ్ వాటర్ ని ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత టమాటోతో స్క్రబ్ చేయాలి. Natural Face pack చర్మం పై డార్క్ స్పాట్ లను తొలగించడానికి టమాటా ఉపయోగపడుతుంది. టమాటా లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి.
ఆ తర్వాత కలబంధ రసాన్ని చర్మపై వేసుకుని చేతులతో మసాజ్ చేసుకోవాలి. కలబంధ వల్ల చర్మం చాలా మృధువుగా అవుతుంది. ఇక ఫైనల్ గా ముల్తానీ మట్టిని వాడి పేస్ ప్యాక్ వేసుకోవాలి. నిమిషం పాతు ముల్తనీ మట్టిని అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే మిమ్మల్ని మీరే చూసి ఆశ్చర్యపోయేలా కాంతివంతంగా తయారవుతారు.
Also Read : BiggBoss 7: మూడో పవర్ అస్త్ర ఎవరి సొంతం..?