Smart Phones:తలపక్కనే ఫోన్ పెట్టుకుని పడుకుంటున్నారా..? అయితే చావును కొని తెచ్చుకున్నట్లే..!!
స్మార్ట్ ఫోన్లు...ఒక మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఒక పూట భోజనం చేయకుండా ఉంటారేమోకానీ స్మార్ట్ ఫోన్ లేనిది ఒక్కక్షణం ఉండరు.
- By hashtagu Published Date - 10:00 AM, Sat - 25 June 22

స్మార్ట్ ఫోన్లు…ఒక మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఒక పూట భోజనం చేయకుండా ఉంటారేమోకానీ స్మార్ట్ ఫోన్ లేనిది ఒక్కక్షణం ఉండరు. పడుకున్నా..తింటున్నా…స్నేహితులతో మాట్లాడుతున్నా…చివరికి టాయిలెట్ వెళ్లినా పక్కనా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేని దుస్థితిలో ఉన్నాం. ఇంత వరకు బాగానే ఉన్నా…ఫోన్ వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలను మనం ఇప్పటివరకు ఎన్నో విన్నాం, చూశాం. కానీ ఆచరణ విషయానికి వస్తే మాత్రం అస్సలు పట్టించుకోం. ఇలా చేయడం వల్లే అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మరీ ముఖ్యంగా కొందరు పడుకునే ముందు తల పక్కనే…లేదంటే దిండు కింద ఫోన్లను పెట్టుకుని నిద్రిస్తుంటారు. అవేవో ఆస్తులు ఎవరో కొట్టేస్తారన్న విధంగా. అలా చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
సాధారణంగా ఫోన్లు 900మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంటాయి. వాటిలో ఉండే రిసీవర్ ఆ ఫ్రీక్వె్న్సీతో కాల్స్ ను స్వీకరిస్తుంది. మనం కాల్స్ చేసినా…అదే ఫ్రీక్వెన్సీతో వెళ్తాయి. సాధారణంగా పగలంతా ఫోన్ మనతోనే ఉంటుంది. రాత్రి పూట కూడా మన శరీరానికి దగ్గరగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా తల పక్కన ఫోన్ పెడితే దాని ద్వారా వెలువడే రేడియో తరంగాలు మనకు ఎంతో హాని చేస్తాయి. ఆ తరంగాల నుంచి వచ్చే రేడియేషన్ తో మన మెదడుపై ప్రభావం పడి ఎన్నో దుష్పరిణామాలకు కారణం అవుతాయి.
నిద్రించేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో ఫోన్ను తలపక్కన పెట్టకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దాని నుంచి వచ్చే రేడియేషన్ తో నిద్రలేమి, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తలపక్కన ఫోన్ను పెట్టుకోవాలనుకుంటే ఎయిర్ ప్లేస్ మోడ్ లో పెట్టాలని…అదే కాల్స్ వస్తాయనుకుంటే ఫోన్ను దూరంగా పెట్టుకుని నిద్రించాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు తలపక్కన ఫోన్ పెట్టినట్లయితే..డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మానసిక వ్యాధులు కూడా వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇకనుంచైనా అలాంటి పనులను మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు.