HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Sleeping Less Than 6 Hours Is A Risk Of Diabetes

Sleep Health Hazard: 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..

రాత్రులు, నిద్ర సమయాల్లో ఇలా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం హెచ్చు, తగ్గులకు లోను కావడం సహజమే. ఆరోగ్యవంతులైన వారు దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

  • Author : Maheswara Rao Nadella Date : 29-11-2022 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sleep Dia
Sleep Dia

ఒక వ్యక్తి నిద్రించినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. రాత్రులు, నిద్ర సమయాల్లో ఇలా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం హెచ్చు, తగ్గులకు లోను కావడం సహజమే. ఆరోగ్యవంతులైన వారు దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, నిద్ర లేమి సమస్య ఉన్నవారికి ఇది ఆందోళనకరమే అని చెప్పుకోవాలి. నిద్ర లేమితో వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అసహజంగా మారతాయి.

ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి నిద్రలేమి సమస్య ఏర్పడితే, వారి బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకుండా పోతుంది. సరైన నిద్ర లేకపోయినా ఇదే సమస్య ఏర్పడుతుంది. నిద్ర లేచినప్పుడు శక్తి చాలదన్నట్టుగా అనిపించడం అది నిద్రలేమికి సూచన. దీంతో వెంటనే ఏదో ఒకటి తినేయాలని అనిపిస్తుంది. ఇలా దీర్ఘకాలం పాటు నిద్రలేమి అధిక బ్లడ్ షుగర్ సమస్యను కలిగిస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇన్సులిన్ నిరోధకత అంటే పాంక్రియాస్ నుంచి విడుదలైన ఇన్సులిన్ కు మన కణాలు స్పందించకపోవడం. రక్తంలోని గ్లూకోజ్ ను ఉపయోగించుకుని శక్తిగా మార్చలేకపోవడం. దీనివల్ల పాంక్రియాస్ మరింత ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. కొంత కాలానికి బ్లడ్ షుగర్ స్థాయులు మరింతగా పెరుగుతాయి. ఇదే టైప్-2 డయాబెటిస్ గా రూపాంతరం చెందుతుంది. స్థూలకాయం సమస్యకు కూడా కారణమవుతుంది.

తగినంత నిద్ర:
రోజుకు 7-8 గంటల పాటు నిద్ర అవసరం. అప్పుడే మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా సాగుతాయి. తగినంత నిద్ర లేకపోవడం, సరైన వేళ్లల్లో నిద్రించకపోవడం, అధిక నిద్ర, ఇవి ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం గుండె జబ్బులకు కూడా కారణమవుతుంది. రక్తంలో బ్లడ్ షుగర్ ను నియంత్రణలో పెట్టుకుంటే, గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, స్థూలకాయం సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

రిస్క్ అధికం:
మధుమేహం ఉన్న వారికి గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ ఎక్కువని పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. ఇందుకోసం శరీరానికి తగినంత నిద్ర ఇవ్వాలి. దీనివల్ల చాలా సమస్యలను దూరంగా పెట్టొచ్చు. రోజులో 6 గంటలకు తక్కువ నిద్రపోయే వారికి టైప్-2 డయాబెటిస్ ముప్పు ఉంటుంది. అలాగే, రోజులో 9 గంటలకు మించి నిద్ర పోయే వారికి కూడా మధుమేహం ముప్పు ఉంటుంది. ముఖ్యంగా 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఫలితంగా డయాబెటిస్ సమస్య ఏర్పడుతుంది. కనుక 7-8 గంటల పాటు నిద్ర, శారీరక వ్యాయామం అన్నవి మధుమేహం ముప్పును తప్పించుకునేందుకు కీలకమని గుర్తించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diabetes
  • health
  • less sleep
  • sleep
  • sleep benefits
  • sugar

Related News

Diabetes drug metformin works in the brain

Metformin: మెట్‌ఫార్మిన్ గురించి షాకింగ్ నిజాలు

Diabetes Medication దశాబ్దాలుగా టైప్ 2 డయాబెటిస్ నియంత్రణకు చౌకైన, సురక్షితమైన మందుగా పేరుపొందిన మెట్‌ఫార్మిన్‌పై శాస్త్రవేత్తలు కీలక విషయాలు కనుగొన్నారు. ఈ మందు కేవలం రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడమే కాకుండా, నేరుగా మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. డయాబెటిస్ మందులు సాధారణంగా కాలేయం, ప్యాంక్రియ

    Latest News

    • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

    • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

    • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

    • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    Trending News

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd