ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల కలిగే అనర్థాలివే!
రోజుకు కనీసం 1 గంట సైక్లింగ్ లేదా 60 నిమిషాల వేగవంతమైన నడక చేయండి. ఇది మిమ్మల్ని ఊబకాయం నుండి కాపాడుతుంది.
- Author : Gopichand
Date : 18-12-2025 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
Sitting Risk: ప్రస్తుతం ఆఫీసులకు వెళ్లేవారు రోజుకు 8 నుండి 9 గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారు. దీనివల్ల ఆదాయం వస్తున్నప్పటికీ ఆరోగ్యంపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతోంది. నిరంతరం కూర్చుని ఉండటం లేదా స్క్రీన్ చూడటం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు వస్తున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, ఊబకాయం బారిన పడుతున్నారు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
నెమ్మదించే జీవక్రియ: నిరంతరంగా 30 నిమిషాలు కూర్చుంటే మెటబాలిజం 90% మందగిస్తుంది.
కొవ్వు పేరుకుపోవడం: రక్తనాళాల నుండి చెడు కొవ్వును తొలగించే ఎంజైమ్‌లు నెమ్మదించడం వల్ల కొవ్వు కరగదు.
నార్వే స్టడీ: రోజుకు 8 గంటలు కూర్చునే వారు కనీసం 1 గంట సమయం తమ కోసం కేటాయించాలి (సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఉత్తమం).
సూచన: ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాల పాటు నడవడం తప్పనిసరి.
Also Read: రెడ్ జోన్‌లో ఢిల్లీ.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండాల్సిందే!
8 గంటలు కూర్చుని ఉండటం వల్ల కలిగే నష్టాలు
- గుండె జబ్బులు రావడం.
- టైప్ 2 మధుమేహం.
- ఊబకాయం.
- కోలన్ క్యాన్సర్ ముప్పు.
- శరీర భంగిమ పాడైపోవడం.
ఎంతసేపు కూర్చోవడం సురక్షితం?
ఆదర్శవంతమైన సమయం: రోజుకు 4 గంటల కంటే తక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యకరం.
చిట్కా: 8 గంటల పనిలో 4 గంటలు కూర్చుని, 4 గంటలు నిలబడి పనిచేస్తే.. అది శరీరానికి 10 మారథాన్‌లు పరిగెత్తినంత ప్రయోజనాన్ని ఇస్తుంది.
ప్రమాద స్థాయి: రోజుకు 4 నుండి 8 గంటలు కూర్చుంటే రిస్క్ మొదలవుతుంది. దీనివల్ల అలసట, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
11 గంటల రొటీన్: ఒకవేళ మీరు రోజుకు 11 గంటలు కూర్చుంటే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం లేదా మరణం సంభవించే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
కూర్చుని చేసే పనివల్ల కలిగే నష్టాల నుండి బయటపడటం ఎలా?
విరామం తీసుకోండి: ప్రతి 30 నిమిషాలకు ఒకసారి సీటు నుండి లేచి కాళ్లు, కళ్లు, మెదడుకు విశ్రాంతి ఇవ్వండి. దీనివల్ల పని సామర్థ్యం కూడా పెరుగుతుంది.
సరైన భంగిమ: కూర్చునే విధానంపై దృష్టి పెట్టండి. తప్పుగా కూర్చోవడం వల్ల నడుము, మెడ వంగిపోవడం, దీర్ఘకాలిక నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
శరీరాన్ని కదిలించండి: పని మధ్యలో చిన్న చిన్న కదలికలు లేదా ఏదైనా డ్యాన్స్ స్టెప్స్ వంటివి చేయండి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
క్రమం తప్పని వ్యాయామం: రోజుకు కనీసం 1 గంట సైక్లింగ్ లేదా 60 నిమిషాల వేగవంతమైన నడక చేయండి. ఇది మిమ్మల్ని ఊబకాయం నుండి కాపాడుతుంది.