HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sandhyareddy Warning To Chandrahas

ఇక యాటిట్యూడ్ స్టార్ పని అయిపోయినట్లే..ఎందుకంటే అసలైన లేడీ టైగర్ దిగింది !!

'బరాబర్ ప్రేమిస్తా' సినిమా విడుదలైన తరుణంలో, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాడిన అభ్యంతరకరమైన పాట, ఆపై ఒక జర్నలిస్టుపై చేసిన అమర్యాదకర వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలో జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇప్పుడు ఈ వ్యవహారంలోకి కాంగ్రెస్ మహిళా నేత, సామాజిక అంశాలపై గళం విప్పే సంధ్యా రెడ్డి ప్రవేశించడం సంచలనంగా మారింది

  • Author : Sudheer Date : 06-02-2026 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrahas Sandhya
Chandrahas Sandhya

Chandrahas : ‘యాటిట్యూడ్ స్టార్’గా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతున్న హీరో చంద్రహాస్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఆయన నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా విడుదలైన తరుణంలో, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాడిన అభ్యంతరకరమైన పాట, ఆపై ఒక జర్నలిస్టుపై చేసిన అమర్యాదకర వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలో జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇప్పుడు ఈ వ్యవహారంలోకి కాంగ్రెస్ మహిళా నేత, సామాజిక అంశాలపై గళం విప్పే సంధ్యా రెడ్డి ప్రవేశించడం సంచలనంగా మారింది. అనసూయ-శివాజీ వివాదంలో తనదైన శైలిలో స్పందించి పాపులర్ అయిన సంధ్యా రెడ్డి, ఇప్పుడు చంద్రహాస్ తీరుపై నిప్పులు చెరిగారు.

నీ తండ్రి పేరు చెడగొట్టకు

చంద్రహాస్ తండ్రి, నటుడు ప్రభాకర్ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నారని, కొడుకుగా ఆయన పేరును చెడగొట్టవద్దని సంధ్యా రెడ్డి హితవు పలికారు. స్టేజ్ మీద బూతు పాటలు పాడటం, అడిగిన వారికి సమాధానం చెప్పకుండా గర్వంతో ఊగిపోవడం సరైన పద్ధతి కాదని ఆమె చురకలంటించారు. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎంత వినయంగా ఉండేవారో చూసి నేర్చుకోవాలని, కేవలం డబ్బు, బ్యాక్‌గ్రౌండ్ ఉందనే అహంకారంతో ప్రవర్తిస్తే ప్రేక్షకులు గుణపాఠం చెబుతారని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.

పబ్లిసిటీ కోసం దిగజారుడుతనం వద్దు

జర్నలిస్టులపై కేసులు పెడతామని బెదిరించడం వల్ల చంద్రహాస్ తన కెరీర్‌ను తనే నాశనం చేసుకుంటున్నారని సంధ్యా రెడ్డి అభిప్రాయపడ్డారు. నెగిటివ్ ప్రచారం ద్వారా వచ్చే ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి కాంట్రవర్సీలు సృష్టించడం నేటి తరం యంగ్ హీరోలకు ఫ్యాషన్‌గా మారిందని, ఇది సమాజానికి చెడు సంకేతాలను పంపిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వివాదాలతో సినిమాను క్లిక్ చేసుకోవాలనుకోవడం కంటే, బాధ్యతాయుతమైన మెసేజ్ ఇచ్చే సినిమాలు చేయాలని ఆమె సూచించారు. “లేడీ టైగర్”గా పేరు తెచ్చుకున్న సంధ్యా రెడ్డి ఈ ఇష్యూలో ఎంట్రీ ఇవ్వడంతో, చంద్రహాస్ ఇకనైనా తన ధోరణి మార్చుకుంటారా లేదా అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrahas
  • Chandrahas Gunji Gunji Song
  • chandrahas song
  • chandrahas song controversy
  • sandhyareddy warning
  • యాటిట్యూడ్ స్టార్

Related News

    Latest News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • షెకావత్ ను దింపుతున్న అనిల్ రావిపూడి ?

    • ఇక యాటిట్యూడ్ స్టార్ పని అయిపోయినట్లే..ఎందుకంటే అసలైన లేడీ టైగర్ దిగింది !!

    • అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైన‌ల్‌.. భార‌త్ భారీ స్కోర్‌!

    • సొంత పార్టీ నేతలకు సీఎం రేవంత్ క్లాస్ ?

    Trending News

      • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

      • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

      • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

      • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

      • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd