HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Shouldnt You Eat Idli And Dosa For Breakfast What Problems Will Arise If You Eat Them Is There Any Truth To This

Diet : బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, దోశ తినకూడదా? తింటే ఏమి సమస్యలు వస్తాయి?..దీనిలో నిజమెంతా?

ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానమిచ్చారు ఫిట్‌నెస్ కోచ్ విశ్వభారత్‌. "ఇడ్లీ, దోశలు తినొద్దు అన్నది పూర్తిగా అపోహ" అని ఆయన చెప్తున్నారు. ఇవి మనం వాడే మినపప్పు, బియ్యం కలిపి తయారుచేస్తాం. ఈ రెండు పకటమైన పోషకాహారాలే. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు.

  • By Latha Suma Published Date - 03:19 PM, Tue - 5 August 25
  • daily-hunt
Shouldn't you eat idli and dosa for breakfast? What problems will arise if you eat them?..Is there any truth to this?
Shouldn't you eat idli and dosa for breakfast? What problems will arise if you eat them?..Is there any truth to this?

Diet : పలుచటి మృదువైన ఇడ్లీ… వేడి వేడి దోశ… ఇవి లేనిదే బ్రేక్‌ఫాస్ట్‌కి ఊహించలేని స్థితి చాలామందికి. దక్షిణ భారతదేశపు హార్ట్‌బీట్ అనుకునే ఈ డిష్‌లు, ఇప్పుడు కొందరికి భయాలుగా మారాయి. ఫిట్‌నెస్ గురులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసే కొన్ని పోస్టుల కారణంగా “ఇవాళ్టి నుంచి ఇడ్లీ, దోశ నో” అంటున్నారు చాలామంది. వాటిలో వైట్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయని, అవి బరువు పెరగడానికి కారణమవుతాయని చెబుతున్నారు.

అయితే వాస్తవం ఏమిటి? నిజంగా ఇవి ఆరోగ్యానికి హానికరమా? బరువు తగ్గాలంటే వీటిని మానేయాలా?

ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానమిచ్చారు ఫిట్‌నెస్ కోచ్ విశ్వభారత్‌. “ఇడ్లీ, దోశలు తినొద్దు అన్నది పూర్తిగా అపోహ” అని ఆయన చెప్తున్నారు. ఇవి మనం వాడే మినపప్పు, బియ్యం కలిపి తయారుచేస్తాం. ఈ రెండు పకటమైన పోషకాహారాలే. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుంటే ఇవి బరువు పెరిగేలా చేయవు అని విశ్వ స్పష్టం చేశారు. వీటితో పాటుగా తీసుకునే చట్నీలు కూడా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయని చెబుతున్నారు. ఉదాహరణకు పల్లీ చట్నీ ప్రోటీన్‌లో రిచ్, కొబ్బరి చట్నీ ఆరోగ్యకరమైన కొవ్వులపై బేస్ అవుతుంది. కొంచెం నెయ్యి వేసుకుని తింటే శరీరానికి అవసరమైన హెల్తీ ఫ్యాట్స్ కూడా లభిస్తాయి.

మరీ ఎంత తినాలి?

ఇవన్నీ తినొచ్చంటున్నారు కదా అని మితిమీరి తినడం మాత్రం తప్పే. విశ్వభారత్‌ చెప్పినట్లు ఏ ఫుడ్ అయినా మితంగా తీసుకుంటేనే మంచిది. నోటికి రుచిగా ఉంది కదా అని ఐదు ఇడ్లీలు, నాలుగు దోశలు తినేస్తే బరువు పెరగక మానదు. మన శరీరానికి అవసరమైన కేలరీలకు తగ్గట్టుగా తీసుకోవాలి అని సూచిస్తున్నారు. అంతేకాదు, ఇడ్లీ, దోశలతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలు కూడా సూచిస్తున్నారు నిపుణులు. ఉదాహరణకి దోశలో పచ్చి ప్రోటీన్ పౌడర్ వేసుకోవచ్చు, లేదా పైన స్ప్రౌట్స్ చల్లి తినొచ్చు. ఇలా చేసినా రుచిలో మార్పు రాకుండా పోషకాల పరంగా ఎఫెక్టివ్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది.

సోషల్ మీడియా మాయలో పడకండి

ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో చాలా మంది తమ అభిప్రాయాలను ఆరోగ్య సూత్రాలుగా చూపిస్తున్నారు. కానీ అందులోని సమాచారం శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడకపోవచ్చు. అందుకే నిష్ణాతుల సలహాలు తీసుకోవడం అవసరం. “వైట్ కార్బ్స్” అనేది శత్రువు కాదని, అవి కూడా శరీరానికి అవసరమే అని నిపుణులు చెబుతున్నారు.

తీరుగా తినండి, ఆరోగ్యంగా ఉండండి

ఇడ్లీ, దోశలు మన ఆరోగ్యానికి హానికరం కావు. అవి మన సంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉండటం కూడా కారణమే కాదు. మనం ఎలా, ఎంత మోతాదులో తింటున్నామన్నది అసలు విషయం. శరీరానికి తగినంత పోషకాలు అందించేట్టుగా, మితంగా తీసుకుంటే ఇవి హెల్తీ ఆప్షన్‌లే. అవసరమైతే ప్రోటీన్, ఫైబర్ వంటి పదార్థాలతో వాటిని బలంగా మార్చుకోవచ్చు. అంతేకాదు మనం చిన్ననాటి నుంచి ఇష్టంగా తినే ఆహారాన్ని ఒక్క వీడియో చూసి వదలకండి. విషయాలను పరిశీలించండి. నిపుణుల మాట వినండి. అప్పుడే మీ ఆరోగ్యం కూడా మంచిదే, మానసిక ప్రశాంతత కూడా మీ సొంతం. కాగా, ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

Read Also: Tollywood Strike : చిరంజీవిని కలవబోతున్న టాలీవుడ్ నిర్మాతలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • breakfast
  • dosa
  • healthy food
  • Idly
  • weight gain
  • weight loss

Related News

India Cricket Team

PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నట్లు సమాచారం. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు.

  • Weight Loss

    ‎Weight Loss: ఫాస్ట్ గా ఈజీగా బరువు తగ్గాలి అంటే రాత్రి పూట ఇవి తినాల్సిందే!

  • Lose Weight

    ‎Weight Loss: ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే పరగడుపున ఈ జ్యూస్ లు తాగాల్సిందే!

Latest News

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

  • Telangana New Cabinet : కొండా అవుట్..విజయశాంతి ఇన్ ..?

  • TG Govt Schools : తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

  • Three-Wheeler Vehicles : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్.. త్రిచక్ర వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం

  • Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd