Juices for Fat Loss: ఈ జ్యూస్‌లు తాగుతూ బెల్లీ ప్యాట్ కి గుడ్ బై చెప్పండి..
కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే.. శరీరంలో పేరుకున్న కొవ్వు త్వరగా కరుగుతుందని, ముఖ్యంగా బెల్లీ ప్యాట్ తగ్గుతుందని
- By Maheswara Rao Nadella Published Date - 06:00 PM, Fri - 17 March 23

మన దేశంలో ఊబకాయుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా.. అధిక బరువు సమస్యతో భాదపడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవటం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలి మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత లేదా అనారోగ్యం కారణంగా కంటే జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్లనే ఊబకాయం అధికమని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కాలంలో సౌకర్యాలు పెరిగాయి.
శారీరక శ్రమ తగ్గింది. వ్యాయామం చేసేవారి సంఖ్య కూడా తక్కువే. క్యేలరీలు కరిగించడమే తక్కువైపోయింది. తాజా కూరగాయలు, పండ్లకు బదులుగా.. ప్రాసెస్ చేసిన ఆహారం, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ కారణాల వల్ల.. ఒళ్లు పెంచేస్తున్నారు. అధిక బరువు కారణంగా.. డయాబెటిస్, గుండె సమస్యలు, ఎముకలు గుల్లబారడం, హైపర్‌టెన్షన్ వంటి సమస్యల ముప్పు పెరిగిపోతుంది.
బరువును తగ్గించడానికి వెయిట్ లాస్ మెషీన్లు, క్రాష్ డైట్లు, వైబ్రేటర్లను ఆశ్రయిస్తున్నారు. వీటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. మీరు తీసుకునే ఆహారంతోనే.. ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇది శరీరానికి తగిన పోషకాలు అందిస్తుంది. కొన్ని రకాల జ్యూస్‌లు (Juices) తాగితే.. శరీరంలో పేరుకున్న కొవ్వు త్వరగా కరుగుతుందని, ముఖ్యంగా బెల్లీ ప్యాట్ (Belly Fat) తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ జ్యూస్‌లు (Juices) ఉదయం పూట తీసుకుంటే మంచి రిజల్ట్స్ పొందవచ్చు. మరి ఈ జ్యూస్‌లు (Juices) ఏంటో తెలుసుకుందాం..
సొరకాయ జ్యూస్:
సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. దీనిలో ఉండే అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. సొరకాయ జ్యూస్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది.
క్యారెట్ జ్యూస్:
బీట్‌రూట్ జ్యూస్:
మీరు బరువు తగ్గాలనుకుంటే.. బీట్‌రూట్ జ్యూస్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. బీట్‌రూట్ పోషకాల పవర్‌హౌస్. దీనిలో విటమిన్ బీ6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, నైట్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది పేగులో చెడు బాక్టీరియాను తొలగించి.. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు అనుమతిస్తుంది. దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.NIH లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం భోజనం తర్వత 1 గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే.. ప్యాట్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది మీ వెయిట్ లాస్ జర్నీకి సహాయపడుతుంది.
క్యాబేజీ జ్యూస్:
పాలకూర జ్యూస్:
పాలకూర మన ఆహారంలో చేర్చుకుంటే.. చాలా మంచిది. పాలకూరలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఏ,సి, కె. వంటివి మెండుగా ఉంటాయి. ఇది తరచుగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు అధిక బరువుతో బాధపడుతుంటే.. రోజూ 1 గ్లాస్ పాలకూర జ్యూస్ తాగితే మంచిది.
Also Read: Recipes for Weight Loss: ఫాస్ట్‌గా బరువు తగ్గడానికి ఈ రెసిపీస్ ట్రై చేయండి..!

Related News

Weight Loss Tips: బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు అస్సలు తీసుకోకూడదా? ఏది నిజం?
కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు. వీటిని పూర్తిగా తగ్గిస్తే బరువు తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే.. కాసేపు ఆగండి.