Diabetes: చక్కెరకు బదులుగా వీటిని వాడితే.. దెబ్బకు జబ్బులు, మధుమేహం పరార్?
సాధారణంగా పెద్దలు చక్కెరను ఎక్కువగా తీసుకోకూడదు అని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న
- By Nakshatra Published Date - 06:50 PM, Mon - 10 October 22
సాధారణంగా పెద్దలు చక్కెరను ఎక్కువగా తీసుకోకూడదు అని చెబుతూ ఉంటారు. మరి ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారిని పంచదారకి దూరంగా ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఒక సర్వే ప్రకారం పంచదార ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట. అందుకే చాలామంది తీపి వస్తువులను ఎక్కువగా తినకూడదు అని చెబుతూ ఉంటారు. అలాగే చక్కెరతో తయారయ్యే తీపి పదార్థాలకు బదులుగా ప్రత్యమ్యాయపదార్థాలను ఉపయోగించటం వల్ల బరువును తేలికంగా తగ్గించుకోవచ్చు. చక్కెరకు బదులుగా వేటిని ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగించడం మంచిది. చాలామంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ టీవీ వస్తువులు లేనటువంటి పోషకాలు బెల్లంలో ఉంటాయి. బెల్లాన్ని తినడం వల్ల సహజ పద్దతిలో అది రక్తం ని శుద్ధి చేస్తుంది. అలాగే జీవక్రీయని పెంచడం, కాలేయాన్ని డిటాక్స్ చేయటం, మల బద్ధకాన్ని తగ్గించడంలో బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ సంబంధించిన సమస్యలను కూడా బెల్లం దూరం చేస్తుంది. అయితే షుగర్ కి బదులుగా పటిక బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ పటిక బెల్లం లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించడం వల్ల అది గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, బ్రెయిన్ ని షార్ప్ గా ఉంచి బాడీని ఫిట్ గా ఉంచుతుంది. అలాగే మనం తినే వస్తువుతో తేనెను కలిపి తీసుకోవడం వల్ల తేలికంగా జీర్ణం అవుతుంది. కోకోనట్ షుగర్.. దీనిని కొబ్బరికాయల నుండి ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా దీనిని తయారు చేస్తారు. దీనిలో పొటాషియం ఐరన్ జింక్ కాల్షియం ఉంటాయి. ఈ కోకోనట్ షుగర్ ని కూడా చివరికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అలాగే డేట్స్ షుగర్ ఇది నేను కూడా పంచదారకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అయితే పైన చెప్పుకున్న వాటిని షుగర్ కు ప్రత్యమ్యాయంగా ఉపయోగించడం వల్ల మధుమేహం అదుపులో ఉండటంతో పాటు అనేక రకాల జబ్బులు కూడా దూరం అవుతాయి.
Related News
Health : డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన టాబ్లెట్స్ ధరలు
కేవలం ఈ వ్యాధులకు వాడే మెడిసిన్స్ ధరలు మాత్రమే కాదు సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలను సైతం తగ్గించింది