Laughing Disease: అతిగా నవ్వుతున్నారా..? అయితే అది కూడా ఓ వ్యాధే..!
- By Gopichand Published Date - 02:45 PM, Fri - 28 June 24

Laughing Disease: కొన్నిసార్లు మీ దుఃఖాన్ని లేదా సంతోషాన్ని మరొకరితో పంచుకునే మార్గం భిన్నంగా ఉండవచ్చు. కొందరు వ్యక్తులు ఏదైనా సాధారణ విషయానికి నవ్వడం ప్రారంభిస్తారు. ఇది అవతలి వ్యక్తికి కొంచెం వింతగా అనిపించవచ్చు. మీ చుట్టూ ఎవరైనా అతిగా నవ్వడం లేదా వింతగా ప్రవర్తించడం చూస్తే నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సంకేతాలు లాఫింగ్ డిజార్డర్ (Laughing Disease) అంటే హైపోమానియాను సూచిస్తాయి. ఈ వ్యాధితో ‘బాహుబలి’ సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క శెట్టి బాధపడుతోంది. దీనిని వ్యావహారికంలో ‘లాఫింగ్ డిసీజ్’ అని కూడా పిలుస్తారు. వైద్యపరంగా దీనిని సూడోబుల్బార్ ఎఫెక్ట్ అంటారు. ఇందులో బాధితులు అకస్మాత్తుగా నవ్వడం లేదా ఏడవడం ప్రారంభిస్తారు.
ఎవరైనా సాధారణ విషయంపై మితిమీరిన సంతోషాన్ని ప్రదర్శిస్తుంటే దానిని పట్టించుకోకపోవడం సరికాదు. ఇది హైపోమానియా. ఇది తీవ్రతరం అయితే నిరాశకు కూడా దారి తీస్తుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
హైపోమానియా/లాఫింగ్ డిజార్డర్ అనేది ఒక మానసిక సమస్య. దీనిలో ఒక వ్యక్తి సంతోషంగా కనిపిస్తాడు. కానీ వాస్తవానికి అతను లోపల ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. అలాంటి వారు ముందు అతిగా మాట్లాడి మరీ చూపిస్తారు. అలాంటి పేషెంట్లు ఒక తెలియని వ్యక్తిని కలిసినప్పుడు వారు ఒకరికొకరు సంవత్సరాలుగా తెలిసినట్లుగా మాట్లాడుతుంటారు. దాని ప్రారంభ సంకేతాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాం.
Also Read: Redmi Note 14 Pro: మార్కెట్లోకి రెడ్ మీ నోట్ 14 ప్రో.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
హైపోమానియా లక్షణాలు
- అన్ని వేళలా తినాలని ఫీలింగ్
- ప్రతిదానిలో అతి ఆత్రుత
- అకస్మాత్తుగా వేరే బట్టలు వేసుకోవడం
- తెలియన వ్యక్తులతో ఎక్కువ మాట్లాడటం
- చిన్న విషయాలకు చాలా సంతోషంగా ఉండటం
- భ్రమలు, ఊహాజనిత విషయాలను నిజమని నమ్మడం
- మీలో మీరే నవ్వుకోవడం లేదా ఏడవడం
- గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, రోజువారీ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం
We’re now on WhatsApp : Click to Join
హైపోమానియాతో బాధపడుతున్న రోగులు మానసిక అనారోగ్యంతో ఉన్నారని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇటువంటి పరిస్థితిలో వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.