HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Keto Diet Weight Loss Plan For Those Who Want To Lose Weight

Weight Loss Plan : బరువు తగ్గాలనుకునే వారికి కీటో డైట్ ప్లాన్..!

మీ శరీరాన్ని కెటోసిన్ (Ketosine) అనే జీవక్రియ స్థితిలో ఉంచడమే ఈ కీటో డైట్ వెయిట్ లాస్ ప్లాన్ (Keto Diet Weight Loss Plan).

  • Author : Maheswara Rao Nadella Date : 22-12-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Keto Diet Weight Loss Plan
Keto Diet Weight Loss Plan

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? కీటో డైట్‌తో (Keto Diet) మీరు వెయిట్ లాస్ గోల్స్‌ని (Weight Loss Goals) రీచ్ అవుతారు. ఎక్కువ మంది ఫాలో అయ్యే ఈ డైట్ తక్కువ కార్బ్స్ (Carbs), ఎక్కువ ఫ్యాట్ (Fat) ఫుడ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మీ శరీరాన్ని కెటోసిన్ (Ketosine) అనే జీవక్రియ స్థితిలో ఉంచడమే ఈ కీటో డైట్ (Keto Diet) వెయిట్ లాస్ ప్లాన్ (Weight Loss Plan). ఇది కొవ్వును కాలుస్తుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కీటో డైట్ మీకు హెల్ప్ చేస్తుంది. దీన్ని ఫాలో అయ్యే ముందు పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఈ కీటో డైట్ లో మీరు ట్రై చేసే కొన్ని రుచికరమైన ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి. అవేంటి? వాటిని ఎలా ప్రిపేర్ చేయాలి? ఇలాంటి పూర్తి వివరాలు అన్ని తెలుసుకోండి..

కీటో బటర్ చికెన్:

This low-calorie butter chicken recipe will make you fall in love all over again | HealthShots

కావాల్సిన పదార్థాలు:

☛ 200 గ్రాముల బోన్స్, స్కిన్ లెస్ చికెన్

☛ 10 గ్రాముల వెన్న

☛ 1 టీస్పూన్ కసూరి మేతి

☛ 100 ml టమాట ప్యూరీ

☛ 1 స్పూన్ అవకాడో ఆయిల్

☛ 50 మి.లీ నీరు

☛ అర టీ స్పూన్ పసుపు

☛ అర స్పూన్ కారం

☛ పావు స్పూన్ మిరియాల పొడి

☛ అర టీ స్పూన్ ధనియా పొడి

☛ ఉప్పు రుచికి సరిపడా

☛ 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు

తయారీ విధానం:

ఓ గిన్నె తీసుకుని అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మసాలాలో చికెన్‌ని వేసి మ్యారినెట్ చేసి 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు పాన్ వేడి చేసి అవకాడో నూనె వేయాలి. చికెన్ పూర్తిగా ఉడికించండి. మరో పాన్‌లో వెన్న వేసి వేడి చేయండి. అది కరిగిన తర్వాత టమాట ప్యూరీని వేసి, వెన్న వేయండి. ఇప్పుడు కసూరి మేతి, నీరు వేయండి. పాన్‌పై మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. టమాట ప్యూరీ వేసి ఉడికించండి. నూనె సెపరేట్ అయ్యాక చికెన్, మిరియాల పొడి, ఉప్పు వేయండి. బాగా కలిపి సన్నని మంటపై ఉడికించండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి.

పనీర్ బుర్జి:

Paneer Bhurji - Chef Kunal Kapur

కావాల్సిన పదార్థాలు:

☛ 83 గ్రాముల పన్నీర్

☛ 10 గ్రాముల ఉల్లిపాయలు

☛ 16 గ్రాముల టమాట

☛ 17 గ్రాముల క్యాప్సికమ్

☛ 16 గ్రాముల చీజ్

☛ 2 గ్రాముల అల్లం తరుగు

☛ 2 గ్రాముల వెల్లుల్లి తరుగు

☛ 2 పచ్చిమిర్చి

☛ 1 టేబుల్ స్పూన్ వెన్న

☛ 1.5 జీలకర్ర

☛ 1 స్పూన్ పసుపు

☛ 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎర్ర మిరపకాయలు

☛ 1.5 స్పూన్ ధనియాల పొడి

☛ గార్నిషింగ్ కోసం కొత్తిమీర

తయారీ విధానం:

ముందుగా పనీర్‌ని ముక్కలు చేయండి. ఇప్పుడు ఓ పాన్ తీసుకుని అందులో వెన్న వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర వేయాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి తరుగు వేయాలి. టమాటాలు, పసుపు, కారం, ధనియాల పొడి వేయండి. కొంచెం నీరు పోసి పాన్‌పై పెట్టాలి. తరిగిన క్యాప్సికమ్, పనీర్ వేయండి. రుచికి సరిపడా వేయండి. ఇప్పుడు, చీజ్ వేసి మరో 3, 4 నిమిషాలు ఉడికించాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి.

కీటో దోశ:

How to make Keto Dosa Recipe

కావాల్సిన పదార్థాలు:

☛ 18 గ్రాముల బాదం పిండి

☛ 15 గ్రాముల మోజారెల్లా తురుము

☛ 30 మిల్లీ లీ. కొబ్బరిపాలు

☛ రుచికి సరిపడా ఉప్పు

☛ జీలకర్ర పొడి చిటికెడు

☛ చిటికెడు ఇంగువ

తయారీ విధానం:

దోశపిండిని కలిపేందుకు అన్ని పదార్తాలను కలపండి. కొద్దిగా నూనె రాసి నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్‌లో పిండిని పోసి పాన్ మీద దోశలా వేయాలి. గోధుమ రంగులోకి వచ్చే వరకూ ఉడికించాలి. దోశ దోరగా వేగాక కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.

కీటో ఉప్మా:

Keto Upma Recipe: कुछ हल्का खाना चाहते हैं डिनर में तो बनाएं कीटो उपमा रेसिपी

కావాల్సిన పదార్థాలు:

☛ 1 కాలీఫ్లవర్

☛ 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు

☛ 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు

☛ 2 టేబుల్ స్పూన్ల నూనె

☛ 4 నుండి 5 కరివేపాకులు

☛ అర టేబుల్ స్పూన్ ఆవాలు

☛ అర టేబుల్ స్పూన్ కారం

☛ అర టేబుల్ స్పూన్ మిరియాలు

☛ అర టేబుల్ స్పూన్ పుపు

☛ రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం:

కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్‌లో వేయండి. పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేయాలి. బాగా కలపండి. బ్లెండ్ చేసిన కాలీఫ్లవర్ వేయండి. చిన్న మంటపై ఉడికించి మసాలా దినుసులు వేయండి.

Also Read:  Easy Weight Loss : ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • health
  • Healthy Weight Loss
  • keto diet
  • Life Style
  • Plan
  • recipes
  • weight loss

Related News

Jeans

జీన్స్ ప్యాంట్‌తోనే ప‌డుకుంటున్నారా?

జీన్స్ క్లాత్ చెమటను సరిగ్గా పీల్చుకోదు. రాత్రంతా చర్మంపై తేమ, చెమట అలాగే పేరుకుపోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతాయి.

    Latest News

    • Elections : తొలి విడతలో 110 సీట్లు గెలుస్తాం – అమిత్ షా ధీమా

    • RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR

    • Hero Sunil : సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన హీరో రాజశేఖర్

    • Bangladesh : బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఇండియాను దాటేస్తుంది – IMF

    • RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd