HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Is Vitamin D Deficiency Also Responsible For Diabetes

Vitamin D: షుగర్ వ్యాధి రావడానికి విటమిన్ డి లోపించడం కూడా కారణమా?

విటమిన్ డి.. శరీరానికి చాలా అవసరం. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 23-02-2023 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vitamin D
Is Vitamin D Deficiency Also Responsible For Diabetes

విటమిన్ డి (Vitamin D) అంటేనే సన్‌ షైన్ విటమిన్. శరీరానికి అతిముఖ్య విటమిన్స్‌ లో ఇది కూడా ఒకటి. ఇమ్యూనిటీ పెంచడంలో విటమిన్ డి (Vitamin D) కీ రోల్ పోషిస్తుంది. సాధారణంగా సూర్యుడి నుంచి లభించే ఈ విటమిన్ డి, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడం ద్వారా కూడా అందుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో విటమిన్ డి తక్కువ అవుతుందో అప్పుడు చాలా సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

విటమిన్ డి (Vitamin D) తో లాభాలు:

శరీరంలో విటమిన్ డి తక్కువైతే చాలా సమస్యలు వస్తాయి. ఎముకలు, దంతాలు, కండరాలు బలహీనమవ్వడం. ఒంటి నొప్పులు, పెద్దల్లో ఆస్టియోమలాసియా, పిల్లల్లో రికెట్స్ వంటి సమస్యలు వస్తాయని యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. విటమిన్ డి లేకపోవడం అనేక సమస్యలు వస్తాయి. అందుకే దీనిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

విటమిన్ డి (Vitamin D) లోపం ఉంటే:

విటమిన్ డి తగ్గడం అనేది గుండెకి మంచిది కాదు. దీని వల్ల గుండె సమస్యలు వస్తాయి. అదే విధంగా బీపి ఎక్కువగా ఉంటే విటమిన్ డి కంట్రోల్ చేస్తుంది. విటమిన్ డి లోపం వల్ల క్రానిక్ పెయిన్స్, మజిల్స్ బలహీనంగా మారి నొప్పులు వస్తుంటాయి. త్వరగా అలసిపోతారు. ఎప్పుడు నిద్రమత్తుగా ఉంటుంది. ఈ లోపం ఉంటే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్, డిప్రెషన్, షుగర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలు విటమిన్ డి లోపం వల్లే వస్తాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరూ విటమిన్ డి తగ్గకుండా చేసుకోవాలి.

రోజురోజుకి పెరుగుతున్న సమస్య:

అయితే, విటమిన్ డి లోపంతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. టాటా 1 ఎంజి ల్యాబ్స్ డేటా ప్రకారం ఇండియాలో దాదాపు 76 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. మొత్తం పురుషుల్లో 79 శాతం, స్త్రీలల్లో 75 శాతం మంది కావాల్సిన స్థాయి కంటే తక్కువగా విటమిన్ డి ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. యూత్ ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొటున్నారని టాటా 1mg డేటా చెబుతోంది.

కారణాలు:

ఇదే విషయంపై మాట్లాడిన టాటా 1 mg, మెడికల్ అఫైర్స్ VP, డాక్టర్ రాజీవ్ శర్మ.. మారుతున్న ఆహారపు అలవాట్లు, సూర్యరశ్మి తగినంతగా లేకపోవడం వల్లే విటమిన్ డి లోపానికి ముఖ్య కారణమని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన సరైన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

ఎలాంటి ఫుడ్:

అదే విధంగా, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు, చేపలు, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. వీటితో పాటు గుడ్లు కూడా మంచివి. మష్రూమ్, పాలు, వెన్నలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా వీటిని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

వీటితో పాటు:

ఇప్పటికే పోషకాహార లోపంతో చాలా మంది బాధపడుతుండగా, విటమిన్ డి కూడా అదనపు సమస్యగా మారింది. దీంతో లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవాలని ఆయ నసూచిస్తున్నారు. ఎండకి ఉండడం, ముఖ్యంగా చలికాలంలో ఎండ తగిలేలా చూసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎండలో ఉండే ముందు కచ్చితంగా చర్మానికి సన్‌స్క్రీన్ లోన్ రాయని సూచిస్తున్నారు. అదే విధంగా, గర్భిణీలు కూడా రోజులో కాసేపు ఎండలో ఉండడం వల్ల తల్లి, బిడ్డకి కూడా మంచిది.

టెస్టులు:

విటమిన్ డి లోపం తగ్గడం వల్ల చిన్నపిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, యువతల, వృద్ధులు ఇలా అందరిపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ విసయంలో జాగ్రత్తలు తీసుకుని ఆరునెలలు, కనీసం సంవ్సరానికి ఓసారైనా టెస్టులు చేయించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా టీబీకి ట్రీట్‌మెంట్ తీసుకున్నవారు కూడా రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకోవడం మంచిది.

Also Read:  Chia Seeds: వేసవిలో చియా విత్తనాలు ఎందుకు తినాలి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • deficiency
  • Diabetes
  • health
  • Life Style
  • Responsible
  • vitamin D

Related News

Here is how you can tell if someone truly loves you!

True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

True Love: ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు. ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని బాధపెట్టే లేదా మీకు నచ్చనిది ఏమీ చేయరు. నిజమైన ప్రేమగల (True Love) వ్యక్తి మీ కోసం ఎల్లప్పుడూ సమయాన్ని వెతుకుతాడు. అతను ఎంత బిజీగా ఉన్నప్పటిక

  • Huge relief for the common man... Government fixes prices of 39 medicines.

    Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • 7 Tips to Curb Insomnia for Stress Management

    Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd