HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Is Milk Doing More Harm Than Good To Your Body

పాలు తాగడం అందరికీ మంచిది కాదా? డాక్టర్ల కొత్త హెచ్చరిక!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట రెండు వంతుల మంది పెద్దలు చిన్నతనం తర్వాత పాలను అరిగించుకునే శక్తిని కోల్పోతారు. ఆసియా ఖండంలో ఈ సంఖ్య 80-90% వరకు ఉంది.

  • Author : Gopichand Date : 29-12-2025 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Milk
Milk

Milk: పాలు తాగడం అనేది భారతీయుల సంప్రదాయంలో ఒక భాగం. అయితే పాలు అందరికీ ఆరోగ్యకరం కాకపోవచ్చని ప్రముఖులు చెబుతున్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భారతదేశంలో పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది భారతీయులు ఎదుర్కొంటున్న గ్యాస్ సమస్యలకు అసలు కారణం పాలు కావచ్చు. దీనిని ‘లాక్టోజ్ ఇంటాలరెన్స్’ అని పిలుస్తారు.

పాలు ఎందుకు సమస్యగా మారుతున్నాయి?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట రెండు వంతుల మంది పెద్దలు చిన్నతనం తర్వాత పాలను అరిగించుకునే శక్తిని కోల్పోతారు. ఆసియా ఖండంలో ఈ సంఖ్య 80-90% వరకు ఉంది. పాలలో ఉండే ‘లాక్టోజ్’ అనే సహజ చక్కెరను అరిగించడానికి శరీరంలో ‘లాక్టేజ్’ అనే ఎంజైమ్ అవసరం. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఈ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. పాలు తాగిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో తిమ్మిర్లు, ఎసిడిటీ, అలసట, మాటిమాటికీ మూత్ర విసర్జన వంటి సమస్యలు వస్తే, అది పాల వల్ల కలిగే ఇబ్బంది అని గుర్తించాలి.

Also Read: మహిళల దుస్తులపై వివాదం.. గుడి దగ్గర వైరల్ గా మారిన పోస్టర్

పాలలో రకాలు, వాటి ప్రభావం

మార్కెట్‌లో లభించే వివిధ రకాల పాల గురించి నిపుణులు ఇలా వివరించారు.

A1 పాలు: సాధారణంగా మార్కెట్‌లో దొరికే ఆవు పాలు. ఇందులో BCM7 అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది.

A2 పాలు: గిర్, సాహివాల్ వంటి దేశీ ఆవుల పాలు. వీటిలో BCM7 ఉండదు కానీ లాక్టోజ్ మాత్రం ఉంటుంది. కాబట్టి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి ఇవి కూడా ఇబ్బంది కలిగించవచ్చు.

లాక్టోజ్-ఫ్రీ పాలు: ఇందులో లాక్టేజ్ ఎంజైమ్ ముందుగానే కలపడం వల్ల సులభంగా అరుగుతాయి.

ప్లాంట్ బేస్డ్ పాలు: బాదం, సోయా, ఓట్స్ పాలలో లాక్టోజ్ అస్సలు ఉండదు.

గేదె పాలు: ఇవి చిక్కగా ఉండి ఆవు పాలతో సమానంగా లాక్టోజ్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటితోనూ సమస్యలు రావచ్చు.

మీకు పాలతో సమస్య ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

దీని కోసం వైద్యులు సులభమైన పరీక్షను సూచించారు.

రెండు నుండి నాలుగు వారాల పాటు: పాలు, పాల ఉత్పత్తులను పూర్తిగా మానేయండి.

మార్పును గమనించండి: మీ గ్యాస్, అలసట, కడుపు సమస్యలు తగ్గాయో లేదో చూడండి.

మళ్లీ ప్రారంభించండి: మళ్లీ పాలు తాగినప్పుడు లక్షణాలు తిరిగి వస్తే మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నట్లే.

ఆసుపత్రులలో ‘హైడ్రోజన్ బ్రీత్ టెస్ట్’ ద్వారా కూడా దీనిని నిర్ధారించుకోవచ్చు.

కాల్షియం కోసం ప్రత్యామ్నాయాలు

పాలు తాగకపోతే కాల్షియం లోపం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. పాలకు బదులుగా ఈ ఆహార పదార్థాల ద్వారా పుష్కలంగా కాల్షియం పొందవచ్చు.

  • నువ్వులు
  • రాగులు
  • బ్రోకోలీ
  • టోఫు
  • ఆకుకూరలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Health Tips Telugu
  • lifestyle
  • milk
  • milk benefits
  • Milk Uses

Related News

Teeth Brush

నిద్రలేవగానే బ్రష్ చేయ‌కూడ‌దా? నిపుణుల స‌మాధానం ఇదే!

సాధారణంగా ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని నిపుణులు సలహా ఇస్తారు. ఈ సమయానికి బ్రష్ పోగులు (బ్రిజిల్స్) పాడైపోతాయి. ఒకవేళ మీ బ్రష్ అంతకంటే ముందే పాడైపోయినట్లయితే, వెంటనే కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది.

  • Sleep

    ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?

  • Pregnant

    మ‌హిళ‌లు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!

  • Are you feeling cold a lot?.. You may have these health problems!

    మీకు చలి ఎక్కువగా అనిపిస్తోందా?.. ఈ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు!

  • Youthfulness

    35 ఏళ్లు దాటాయా? మీ శారీరక సామర్థ్యం తగ్గే సమయం ఇదే!

Latest News

  • రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

  • వైకుంఠ ఏకాదశి రోజు పాటించాల్సిన 7 నియమాలు ఇవే !

  • ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను అభినందించి ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!

  • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

  • న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

Trending News

    • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

    • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

    • డిసెంబర్ 31లోపు మ‌నం పూర్తి చేయాల్సిన ముఖ్య‌మైన‌ పనులు ఇవే!

    • టీమిండియా టీ20 జ‌ట్టుకు కాబోయే కెప్టెన్ ఇత‌నే!

    • శుభ‌వార్త‌.. వెండి ధరల్లో భారీ పతనం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd