High Cholesterol: ఈ టిప్స్ ఫాలో అయితే అధిక కొలెస్ట్రాల్ త్వరగా కరుగుతుంది.
- By Maheswara Rao Nadella Published Date - 05:00 PM, Wed - 22 February 23

ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ (High Cholesterol) పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఈ ప్రాణాంతక సమస్యను ఎదుర్కొంటున్నారు. కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా, మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి తోడ్పడుతుంది. దీనిని పెంచుకోవటం వల్ల అనారోగ్యాలను తప్పించుకోవచ్చు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, మెదడుకు వెళ్లి ధమనులందు అవరోధం ఏర్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. మారిన లైఫ్‌స్టైల్, జంక్ ఫుడ్, ఒంటికి సరిగా వ్యాయామం లేకపోవటం, మితిమీరిన తిండి, కూర్చుని ఒకే చోట పనిచేయటం, నిద్రలేమి కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
అధిక కొలెస్ట్రాల్ (High Cholesterol) కారణంగా గుండె సమస్యలు, స్ట్రోక్, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా.. కొలెస్ట్రాల్ తగ్గించే కొన్ని టిప్స్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా మనతో పంచుకున్నారు.
కొలెస్ట్రాల్ (Cholesterol) ఎలా కరుగుతుంది?
మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి:
బరువు అదుపులో ఉంచుకోండి:
స్మోకింగ్‌కు దూరంగా ఉండండి:
ఆల్కహాల్ మానేయండి:
వ్యాయామం చేయండి:
శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తంలోని సిరల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. రోజుకు అరగంట వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని బట్టి ఇంకాస్త ఎక్కువసేపు చేసినా మేలే. కాస్త వేగంగా నడవటం వంటి గుండెకు పని చెప్పే వ్యాయామాలు గుండె జబ్బు, పక్షవాతం ముప్పు తగ్గేలా చేస్తాయి. బరువూ తగ్గుతుంది.
Also Read: Kashmir Trip: ఈ వసంత 2023లో కాశ్మీర్ లో చేయవలసిన 7 పనులు