Summer Food: ఎండాకాలంలో ఈ ఆహారం తింటే బరువు తగ్గడంతోపాటు చలవ చేస్తుంది..
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. పెరిగిన ఉష్ణోగ్రతలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అలాంటి టైమ్‌లో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
- By Maheswara Rao Nadella Published Date - 09:00 AM, Sun - 19 March 23

ఏ కాలనికి తగ్గట్లు ఆ కాలానికి తీసుకునే ఫుడ్ విషయంలో మార్పులు చేసుకోవాలి. అందులో భాగంగానే ఎండాకాలంలో (Summer Season) రానే వచ్చేసింది. చాలా చోట్ల పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఇప్పట్నుంచే సరైన ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని తీసుకోవడం చాలా వరకూ సమస్యలు దూరమవుతాయి. మరో ముఖ్య విసయం ఏంటంటే.. వీటిని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఎలాంటి ఫుడ్?
పెరుగు:
ప్రో బయోటిక్ రిచ్ ఫుడ్ అయిన పెరుగు కచ్చితంగా తీసుకోవాల్సిన ఐటెమ్. ఇది జీర్ణ క్రియను మెరుగ్గా చేయడమే కాకుండా కడుపులో మంటను తగ్గిస్తుంది. ఈ మిల్క్ ప్రోడక్ట్‌లో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారతాయి. ఇందులోని ప్రోటీన్ బరువుని కంట్రోల్ చేసేందుకు సాయపడతాయి.
జావ:
జావ, అంబలి ఇలా వేటినైనా తీసుకోవచ్చు. వీటిని కూడా జొన్న పిండి, రాగి పిండితో చేసుకోవచ్చు. దీని వల్ల కడుపు నిండుగా అనిపించడమే కాకుండా చల్లగా ఉంటుంది. ఈ పిండిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఈ డ్రింక్ బాడీని చల్లగా ఉండేలా చేస్తుంది.
పనస పండు:
పనస పండు.. ఈ పండు రుచిగానే ఉందనుకుంటారు చాలామంది. కానీ.. దీనిని తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఎన్నో ఖనిజాలు, విటమిన్స్ ఉన్న ఈ జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండుని కచ్చితంగా తినాలి. ఇందులోని ఇమ్యూనిటీ పవర్ శరీరాన్ని బలంగా చేస్తుంది.
పుచ్చకాయ:
దోసకాయ:
నీటితో పాటు పోషకాలు పుష్కలంగా ఉన్న ఫ్రూట్స్‌లో దోసకాయ ఒకటి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరం చల్లబడడమే కాదు, బరువు కూడా కంట్రోల్‌లోనే ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ దోసకాయ తింటే జీర్ణ క్రియ మెరుగ్గా మారి మలబద్ధకం దూరమవుతుంది. ఈ దోసకాయను తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీనిని తింటే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
చివరిగా:
ఎండాకాలంలో (Summer Season) ఊరికే అలసిపోతాం. కాబట్టి, కచ్చితంగా రెండు, మూడు గంటలకి ఓ సారి లిక్విడ్స్ తీసుకోవడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవడం మంచిది. అదే విధంగా, వీలైనంత వరకూ ఎక్కువగా ఎండలో ఉండకుండా ప్రయత్నించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెరిగిన ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం.
Also Read: Sprouted Fenugreek: మొలకెత్తిన మెంతులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

Related News

Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?
8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.