Thyroid: థైరాయిడ్ ఉన్నవారు కోడి గుడ్లు తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
థైరాయిడ్ సమస్య ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:00 AM, Mon - 12 May 25

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య లలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ఎక్కువ శాతం మంది స్త్రీలే ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్న వారు ఆహార పదార్థాల విషయంలో కూడా చాలా రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి. కోడి గుడ్డు తినవచ్చా లేదా అని చాలామంది సందేహ పడుతూ ఉంటారు. మరి థైరాయిడ్ ఉన్నవారు గుడ్డు తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలని చెబుతూ ఉంటారు. గుడ్లలో ఉండే ప్రోటీన్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణానికి బాగా సహాయపడుతుందని చెబుతుంటారు.
వ్యాయామం చేస్తూ ప్రతిరోజూ జిమ్ కు వెళ్లేవారు లేదా హెల్తీగా బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తింటూ ఉంటారు. గుడ్లలో ప్రోటీన్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయట. కాగా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా గుడ్లు చాలా మంచివి అని చెబుతున్నారు. గుడ్లలో ఉండే ప్రోటీన్లు, సెలీనియం, విటమిన్ డి, ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయట. అందుకే థైరాయిడ్ పేషెంట్లు గుడ్లను తినాలని చెబుతున్నారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు గుడ్లను తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలట. గుడ్లలో సెలీనియం ఎక్కువ మొత్తంలో ఉంటుందట. ఇది థైరాయిడ్ గ్రంథిని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ అని చెబుతున్నారు. ఇది శరీరంలో మంటను తగ్గించి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయడానికి సహాయపడుతుందట. అలాగే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందట.
ఇది థైరాయిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాలు థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి చాలా అవసరం అని చెబుతున్నారు. ఇంతేకాదు పుష్కలంగా ప్రోటీన్ ను పొందడం వల్ల జీవక్రియ సమతుల్యంగా ఉంటుందట. అలాగే థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుందట. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన అయోడిన్ గుడ్లలో పుష్కలంగా ఉంటుందట. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, ట్రైయోడోథియోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అయోడిన్ చాలా అవసరం అని చెబుతున్నారు. అందుకే థైరాయిడ్ ఉన్నవారు గుడ్లను తింటే రోజువారి అయోడిన్ అవసరం తీరుతుందట. థైరాయిడ్ పనితీరు కూడా మెరుగుపడుతుందట. కాగా గుడ్లలో ఒమేగా 3, ఒమేగా 6 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, థైరాయిడ్ పనితీరును మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడతాయని చెబుతున్నారు. గుడ్లలో ఉండే కొవ్వు ఆమ్లాల సహాయంతో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయట. ఇది థైరాయిడ్ పేషెంట్లను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. హైపోథైరాయిడిజం సమస్యలు ఉన్నవారు చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. కాబట్టి వీళ్లు తమ రోజువారి ఆహారంలో గుడ్లను చేర్చుకుంటే మంచిదట. ఎందుకంటే గుడ్లలో ఉండే ప్రోటీన్ కంటెంట్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.