శారీరక బలహీనతను తరిమికొట్టే అద్భుత చిట్కా ఇదే!
వ్యక్తి ఎంత విశ్రాంతి తీసుకున్నా లేదా ఎంతసేపు నిద్రపోయినా శరీరంలో శక్తి లేనట్లుగానే అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి బలహీనతతో ఇబ్బంది పడుతుంటే దాన్ని దూరం చేయడానికి ఆయుర్వేద నిపుణులు అద్భుతమైన చిట్కాను వివరించారు.
- Author : Gopichand
Date : 23-12-2025 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
Weak Body: శారీరక బలహీనత అంటే శరీరంలో పని చేయడానికి తగినంత శక్తి లేకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం. వ్యక్తి ఎంత విశ్రాంతి తీసుకున్నా లేదా ఎంతసేపు నిద్రపోయినా శరీరంలో శక్తి లేనట్లుగానే అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి బలహీనతతో ఇబ్బంది పడుతుంటే దాన్ని దూరం చేయడానికి ఆయుర్వేద నిపుణులు అద్భుతమైన చిట్కాను వివరించారు. ఒక మొక్క విత్తనాలు శరీరానికి అమితమైన శక్తిని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.
బలహీనతను పోగొట్టే రామబాణం వంటి చిట్కా
శరీరంలో బలహీనతను పోగొట్టడానికి తులసి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కావలసినవి: 100 గ్రాముల తులసి విత్తనాలు, అర కిలో పటిక బెల్లం.
తయారీ విధానం: తులసి విత్తనాలు, పటిక బెల్లం పొడిని కలిపి మెత్తగా నూరి భద్రపరుచుకోవాలి.
Also Read: సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత్ తదుపరి కెప్టెన్ ఎవరు?
ఎలా తీసుకోవాలి?
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక చెంచా ఈ పొడిని పాలలో కలుపుకుని తాగాలి. ఇది శారీరక బలహీనతను తొలగించి శరీరాన్ని ధృడంగా మారుస్తుంది.
శారీరక బలహీనత లక్షణాలు
- ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం.
- తరచుగా తల తిరగడం లేదా కళ్ళు తిరగడం.
- ఏ విషయంపై పైనా దృష్టి పెట్టలేకపోవడం.
- కండరాల నొప్పులు, వాపు.
- గుండె కొట్టుకునే వేగంలో మార్పులు.
- తరచుగా తలనొప్పి రావడం.
- చర్మం పాలిపోయినట్లు కావడం.
- ఆకలి తగ్గడం.
- శరీర సమతుల్యత దెబ్బతినడం.
బలహీనతకు కారణాలు
రక్తహీనత: శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గడం వల్ల బలహీనత వస్తుంది.
థైరాయిడ్: థైరాయిడ్ సమస్య వల్ల మెటబాలిజం ప్రభావితమై నీరసం వస్తుంది.
డీహైడ్రేషన్: శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల తల తిరగడం, శక్తి లేనట్లు అనిపించడం జరుగుతుంది.
వ్యాధులు: డయాబెటిస్, గుండె జబ్బులు లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల శరీరం బలహీనపడుతుంది.
నిద్రలేమి: సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా అలసట వస్తుంది.
బలహీనతను తగ్గించే ఇతర ఇంటి చిట్కాలు
బాదం: ఇందులో విటమిన్-ఇ, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.
పాలు: పాలలో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గోరువెచ్చని పాలలో తేనె కలుపుకుని తాగితే ఎముకలు, కండరాలు ధృడపడతాయి.
ఉసిరి: విటమిన్-సి, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గుడ్డు: ప్రోటీన్, ఐరన్, విటమిన్-ఎ, ఫోలిక్ యాసిడ్ ఉండే గుడ్డును రోజూ ఒకటి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.