HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Heart Attack Signals Our Body Sends Before A Heart Attack

Heart Attack: గుండెపోటు వచ్చే ముందు మన శరీరం ఇచ్చే సంకేతాలు..!!

  • Author : Vamsi Chowdary Korata Date : 01-05-2026 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Symptoms Of Heart Attack
Symptoms of Heart Attack

ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా భావించిన గుండె జబ్బులు నేటి మోడ్రన్ ఎరాలో 18-45 ఏళ్ల మధ్య వయస్కులను సైతం కబళిస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన యువ గుండెను బలహీనపరుస్తున్నాయి. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లతో పాటు నిద్రలేమి, ఒత్తిడి కూడా గుండె జబ్బుల ముప్పును మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా తోడవుతుండటంతో గుండె జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం చికిత్స కంటే నివారణ ముఖ్యమని.

గతంలో గుండె జబ్బులు అంటే కేవలం ముసలి వాళ్లకు లేదా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు వచ్చేవి అనుకునే వాళ్లం. కానీ ఇటీవల గుండె జబ్బులు, గుండె పోటు మరణాలు వంటివి పెరుగుతున్నాయి. హర్యానాలో 2020 జనవరి నెల నుంచి 2026 జనవరి మధ్యకాలంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు సుమారు 18,000 మంది గుండెపోటు లేదా గుండె వైఫల్యం కారణంగా మరణించారనే వార్తలు, నివేదికలు వెలువడిన విషయం మనందరికీ తెలిసిందే.

18-45 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో గుండె సంబంధిత మరణాలు పెరుగుతున్నాయనే నివేదికలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 20, 30, 40 ఏళ్ల వయసు ఉన్న వారిలో గుండె సంబంధ వ్యాధులు, గుండె పోటు పెరగడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

డాక్టర్‌ ఏం చెబుతున్నారంటే..

డాక్టర్‌ చెబుతున్న దాని ప్రకారం.. చిన్న వయసులోనే గుండె జబ్బులకు అధిక ఒత్తిడి, పోషకాహార లోపం, వ్యాయామం లేకపోవడం, డ్రింకింగ్‌, స్మోకింగ్‌, ఊబకాయం వంటివి ప్రధాన కారణం. వీటికి తోడు బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ వంటివి కూడా గుండెను దెబ్బతీస్తాయి. అయితే పండ్లు, కూరగాయలు, నట్స్‌ వంటి మంచి ఆహారాన్ని తీసుకుని.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. ధ్యానం, యోగా ద్వారా ఒత్తిడిని కంట్రోల్‌ చేసుకోవాలి.

అలాగే రోజూ 6 నుంచి 8 గంటలు మంచి నిద్రపోవాలి. అలాగే కుటుంబంలో గుండె జబ్బుల హిస్టరీ ఉంటే బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ పరీక్షలు తరచూ చేయించుకుంటూ ఉండాలని.. చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవడంతో పాటు గుండెపోటు సంకేతాలను వీలైనంత తొందరగా గుర్తించడం ప్రధానమని పేర్కొన్నారు.

గుండె అనారోగ్యాలకు ప్రధాన కారణాలు

గుండె అనారోగ్యానికి ప్రధానంగా అధిక ఒత్తిడి, జంక్‌ ఫుడ్‌, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం, ఒబేసిటీ, బీపీ, మధుమేహం మరియు కొలెస్ట్రాల్‌ కారణమవుతున్నాయి. కాబట్టి బయట ఫుడ్‌కి దూరంగా ఉండటం, మంచి పోషకాహారం తీసుకోవడం.. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, మంచిగా నిద్రపోవడం ప్రధానం.

దృష్టి పెట్టాల్సిన అంశాలు

20 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు తమ రోజువారీ అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవాలి. కుదిరితే జాగింగ్‌, సైక్లింగ్‌, ఎక్సర్‌సైజ్‌ చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ధ్యానం, యోగా, ఇష్టమైన వ్యాపకాల ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు టెస్ట్‌లు చేయించుకోవాలి

దూరం పెట్టాల్సిన విషయాలు

బరువును అదుపులో ఉంచుకుంటూ డ్రింకింగ్‌, స్మోకింగ్‌ మానేయాలి. ఒకవేళ మానలేకపోతే వీలైనంత పరిమితం చేయాలి. అలాగే పోషకాలు లేని జంక్‌ ఫుడ్‌, ఆయిల్‌ ఫుడ్‌, మసాలాలు వంటివి దూరం పెట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా సరిపడినంత నీళ్లు తాగాలి. 6 నుంచి 8 గంటల పాటు గాఢ నిద్రపోయేలా ఆలోచించాలి.

గమనించుకోవాల్సిన లక్షణాలు

అయితే గుండె సంబంధిత సంకేతాలను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణమైన అలసట, మైకంగా ఉండటం, దవడ మరియు చేతుల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు ఉంటే ఏడాది ఒకసారైనా పరీక్షలు చేయించుకోవాలి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Death Heart Attack
  • early heart attack
  • Healthy
  • heart attack
  • Heart Attack Alert
  • Heart Attack Symptoms
  • Life Style Tips

Related News

    Latest News

    • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

    • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

    • Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

    • లంచం అడిగిన అధికారులపై.. చెప్పుతో కొట్టిన కండక్టర్

    • Bhuvneshwar Kumar: ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు..

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd