Weight Gain: సన్నగా బక్కపలుచగా ఉన్నానని దిగులు చెందుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ తినాల్సిందే!
ఎంత తిన్నా కూడా లావు అవ్వడం లేదు బక్కగా సన్నగా ఉన్నానని దిగులు చెందుతున్నారా, అయితే ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు తింటే తప్పకుండా లావు అవ్వడం ఖాయం అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:00 PM, Fri - 16 May 25

మామూలుగా కొంతమంది లావుగా ఉన్నవారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక చిన్నగా ఉన్నవారు లావుగా అవ్వడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత తిన్నా సరే లావు అవ్వకుండా బక్కగా ఉంటారు. లావు అవ్వడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా బరువు పెరగడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా, ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు తీసుకుంటే ఈజీగా ఆరోగ్యంగా బరువు పెరగడం ఖాయం అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆవకాడో పండు సహజంగా కొవ్వులు ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ లు, ఖనిజాలు కూడా ఉంటాయట.
ఈ పండును సలాడ్, శాండ్విచ్, స్మూతీలో కలిపి తీసుకుంటే శరీరానికి తగిన శక్తి అందుతుందని,బరువు పెరగాలనుకునే వారికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే చీజ్ కూడా బరువు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. చీజ్ ను సలాడ్, పాస్తా, శాండ్విచ్ వంటి వంటకాలతో కలిపి తినడం ద్వారా శక్తి పెరుగుతుందట. ఆల్మండ్ లేదా పీనట్ బటర్ లలో సహజంగా ప్రోటీన్, ఫ్యాట్ లు అధికంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. బ్రెడ్ టోస్ట్ మీద వేయడం, లేక ఫ్రూట్ స్మూతీల్లో కలిపి తీసుకోవడం వల్ల ఇది శక్తిని అందిస్తుందట.
అలాగే తక్కువ మోతాదులో కూడా ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం ఇది అని చెబుతున్నారు. పండ్లు, పాలు, గింజలు, యోగర్ట్, ప్రోటీన్ పౌడర్, నట్ బటర్ వంటి పదార్థాలతో తయారయ్యే స్మూతీలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయట. ఇవి ఉదయాన్నే లేదా వర్కౌట్ తర్వాత తీసుకుంటే మంచిదని,అధిక కేలరీలు కావాల్సిన వారికి ఇది మంచి ఎంపిక అని చెబుతున్నారు. అలాగే వైట్ రైస్ లో కూడా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయని చెబుతున్నారు. కూరలతో లేదా పాలకూర లతో కలిపి తింటే శక్తి, పోషణ రెండూ లభిస్తాయట. బరువు పెరగాలనుకునే వారు రోజూ అన్నాన్ని తప్పకుండా తినాలని చెబుతున్నారు. అలాగే పాలు ప్రోటీన్, ఫ్యాట్ లు, కార్బ్స్ సమతుల్యంగా కలిగి ఉండటంతో శరీరానికి పూర్తి శక్తిని అందిస్తాయట.
కాగా రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల పాలును తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయని, కండరాల బలానికి కూడా ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. కోకో అధికంగా ఉండే డార్క్ చాక్లెట్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాట్ లు అందించడంలో కీలకంగా ఉంటుందట. అయితే దీనిని మితంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందట. ఇది రుచికరమైనది కావడంతో పాటు బరువు పెరగడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. బంగాళదుంపలు కూడా బరువు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. బంగాళదుంపలలో స్టార్చ్ అధికంగా ఉంటుంది. దీని వల్ల శక్తి త్వరగా అందుతుందట. ఉడికించి, వేయించి లేదా రోస్ట్ చేసి తింటే పోషకాలు తగ్గకుండా శక్తిని అందిస్తుందట. వీటిని కూరగాయలతో కలిపి వండితే బలంగా ఉండే శక్తివంతమైన ఆహారంగా మారుతుందని, దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు అని చెబుతున్నారు. అయితే ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారు రోజువారీ ఆహారంలో పై పదార్థాలను చేర్చితే మంచిదట. పైన చెప్పిన ఇవి సహజంగా శక్తిని అందించడమే కాకుండా శరీరాన్ని బలంగా కూడా మారుస్తాయని చెబుతున్నారు.