HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips Whether Its Migraine Or Tension Headache Experts Advise Against Consuming These Things

Headache: మైగ్రేన్, తలనొప్పి స‌మ‌స్య వేధిస్తుందా? అయితే ఈ పొర‌పాట్లు చేయ‌కండి!

కాఫీలో ఉండే కెఫీన్ మొదట్లో తలనొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. కానీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే శరీరంలో దానిపై ఆధారపడటం పెరుగుతుంది. తలనొప్పి మరింత ఎక్కువగా ట్రిగ్గర్ అవుతుంది.

  • By Gopichand Published Date - 09:31 PM, Sun - 2 November 25
  • daily-hunt
Headache
Headache

Headache: ఈ రోజుల్లో బిజీ లైఫ్‌లో తల‌నొప్పి (Headache), మైగ్రేన్, టెన్షన్ హెడేక్ వంటి సమస్యలు చాలా సాధారణం అయ్యాయి. ఎక్కువసేపు స్క్రీన్‌పై పని చేయడం, నిద్ర లేమి, అసమతుల్య ఆహారం, మానసిక ఒత్తిడి ఇవన్నీ మన మెదడు, శరీరంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. చాలా మంది తరచుగా నొప్పి నివారణ మాత్రలు వేసుకుని ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ అసలు కారణాలపై దృష్టి పెట్టరు.

అయితే మీకు తెలుసా? మీరు రోజూ చేసే కొన్ని చిన్న పొరపాట్లే మైగ్రేన్ లేదా టెన్షన్ హెడేక్‌కు దారి తీయవచ్చు? ఈ అలవాట్లను సకాలంలో సరిదిద్దుకుంటే ఈ బాధాకరమైన సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఆరోగ్య నిపుణుల‌ అభిప్రాయం ప్రకారం.. మీరు మైగ్రేన్ లేదా టెన్షన్ హెడేక్‌తో బాధపడుతుంటే మందులతో పాటు మీ జీవనశైలి (లైఫ్‌స్టైల్), ఆహారంపై (డైట్) శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు తెలియకుండానే మనం నొప్పిని మరింత పెంచే ఆహారాలను తీసుకుంటాం. కింద పేర్కొన్న వాటిని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ఆహారాలను తీసుకోకూడదు

జున్ను: నిపుణుల ప్రకారం.. మీరు జున్ను తింటే ఈరోజే మానేయండి. ఎందుకంటే ఇందులో టైరమైన్ అనే మూలకం ఉంటుంది. ఇది మైగ్రేన్‌ను ట్రిగ్గర్ చేయవచ్చు. పాత లేదా ప్రాసెస్ చేసిన జున్ను తలనొప్పిని పెంచుతుంది. కాబట్టి జున్ను తీసుకోవడం పరిమితం చేయండి లేదా పూర్తిగా మానుకోండి.

చైనీస్ ఫుడ్: చైనీస్ ఫుడ్‌లో తరచుగా MSG (Monosodium Glutamate) అనే రసాయనం ఉంటుంది. ఇది మెదడులోని నరాలను ప్రేరేపిస్తుంది. దీని వల్ల టెన్షన్ హెడేక్ లేదా మైగ్రేన్ దాడి రావచ్చు.

Also Read: South Africa: భార‌త్ నిర్దేశించిన 299 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా సాధించ‌గ‌ల‌దా?

కోల్డ్ డ్రింక్స్: నిపుణుల అభిప్రాయం ప్రకారం కోల్డ్ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి హానికరం. వీటిలో ఉండే కెఫీన్, అధిక చక్కెర (హై షుగర్ కంటెంట్) శరీరంలో డీహైడ్రేషన్ పెంచి, రక్త ప్రసరణపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల తలనొప్పి పెరగవచ్చు.

చాక్లెట్: చాక్లెట్ మూడ్‌ను మెరుగుపరుస్తుంది. కానీ ఇందులో ఉండే కెఫీన్, థియోబ్రోమైన్ మైగ్రేన్ రోగులకు హానికరం కావచ్చు.

ఆల్కహాల్: ఆల్కహాల్ శరీరంలో నీటి కొరతను సృష్టించి, రక్తనాళాలను విస్తరిస్తుంది. దీనివల్ల తలనొప్పి లేదా మైగ్రేన్ నొప్పి పెరుగుతుంది. మైగ్రేన్ రోగులు ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

కాఫీ: కాఫీలో ఉండే కెఫీన్ మొదట్లో తలనొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. కానీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే శరీరంలో దానిపై ఆధారపడటం పెరుగుతుంది. తలనొప్పి మరింత ఎక్కువగా ట్రిగ్గర్ అవుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cheese
  • Chinese Food
  • headache
  • health tips
  • lifestyle
  • migraine
  • Tension Headache

Related News

Drinking Water

‎Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Foot Soak

    Foot Soak: ఇలా చేస్తే నొప్పి, అలసట నిమిషాల్లో మాయం!

  • Drumstick Water

    ‎Drumstick Water: ఉదయాన్నే పరగడుపున మునగకాయ నీరు తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • Weight Loss

    ‎Weight Loss: ఫాస్ట్ గా ఈజీగా బరువు తగ్గాలి అంటే రాత్రి పూట ఇవి తినాల్సిందే!

  • Root Vegetables

    Root Vegetables: చలికాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

Latest News

  • India Squad: పాక్‌తో మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్న భార‌త్.. ఎప్పుడంటే?

  • Jagruthi Janam Bata : భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే చెప్పలేను – కవిత

  • Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Harassed : తెలుగు సీరియల్ నటిపై వేధింపులు

  • Honda Activa 8G : అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్ లోకి హోండా యాక్టివా 8G..ధర ఎంత తక్కువో !!

Trending News

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

    • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd