HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips Pregnant During Winters

Pregnant Care: చలికాలంలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే?

శీతాకాలం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా

  • Author : Anshu Date : 21-12-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pregnant Care
Pregnant Care

శీతాకాలం వచ్చింది అంటే చాలు ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చాలామంది చలికాలంలో ఉదయం లేవాలి అంటేనే బద్ధకిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చలికాలంలో నిద్ర లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఉదయాన్నే లేచి కాస్త వ్యాయామం చేయాలి. అంతేకాకుండా సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల తల్లితో పాటు బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చలికాలంలో నీరు తాగాలని అనిపించదు అయినా కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు 2.5 నుంచి 3. కడుపులో ఉమ్ము నీరు ఏర్పడడం కోసం నీరు అవసరం. అలాగే శరీరంలో రక్తం స్థాయి పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు శీతాకాలంలో టీ కాఫీ వంటివి ఎక్కువగా తాగకూడదు. టీ కి బదులుగా ఏదైనా సూప్ లేదా కొబ్బరినీళ్లు జ్యూసులు తాగడం మంచిది. చలికాలంలో జబ్బులు రాకుండా ఉండాలి అంటే ఫ్లూ షాట్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే సబ్బుతో నీటిని తరచుగా కడుక్కుంటూ ఉండాలి. అనారోగ్యం ఉన్న వ్యక్తులకు గర్భిణి స్త్రీలు దూరంగా ఉండటం మంచిది.

అలాగే చలికాలంలో గర్భిణీ స్త్రీలు చురుకుగా ఉండడం కోసం క్రమం తప్పకుండా సున్నితమైన యోగాలు చేయాలి. గర్భవతిగా ఉన్నప్పుడు చేసే సున్నితమైన యోగాల వల్ల వెన్నునొప్పి అలసగా వంటివి తగ్గి శరీర నొప్పులను తగ్గిస్తుంది. అలాగే రాత్రి సమయంలో తొందరగా పడుకుని తగినంతసేపు నిద్రపోవాలి. ఉదయాన్నే సూర్య కిరణాలకు కాసేపు కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. మార్నింగ్ సిక్‌నెస్, ఆహార మార్పులు, చర్మ సంరక్షణ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో చర్మ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితుల్లో మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను వాడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health tips
  • Pregnant Care
  • winter

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd