HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips In Weight Loss With Flax Seeds

Health Tips: తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ గింజలు తీసుకుంటే చాలు!

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల చిట్కాలు

  • Author : Anshu Date : 14-01-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Panchakarma
Panchakarma

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల చిట్కాలు పాటించడంతోపాటు జిమ్ కి వెళ్లడం కసరత్తులు చేయడం, ఎక్సర్సైజులు చేయడం, డైట్ ను ఫాలో అవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఫలితం లభించదు. అలాంటప్పుడు అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తొందరగా బరువు తగ్గాలంటే ఈ గింజలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ గింజలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీని కోసం వాడాల్సిన పదార్థాలు అవిస గింజలు, జీల కర్ర అలాగే కరివేపాకు.

మొదట కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రను తీసుకుని దానిని స్టవ్ మీద పెట్టి అది కొద్దిగా వేడి కాగానే ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా అవిసె గింజలు, నాలుగైదు రెబ్బల కరివేపాకులు తీసుకుని పాత్రలో బాగా వేయించాలి. పొడి పొడిగా అయిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ప్రతి రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ పొడిని కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడం మొదలవుతుంది. ఈ చిట్కాలో అవిసె గింజలు జీవక్రియ రేటు అలాగే జీర్ణ క్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి ఇది పని చేస్తుంది. అవిసె గింజలు ఫైబర్ ను పుష్కలంగా అందిస్తుంది.

ఇది కొద్దిగా తీసుకోగానే కడుపు నిండిన ఫీల్ వస్తుంది. అలాగే ఇతర బరువు తగ్గించే ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. జీలకర్ర జీర్ణక్రియను సహాయపడి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. జీరా నీరు జీర్ణ క్రియకు సాయపపడుతుంది. అలాగే ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. కొవ్వు బర్నింగ్ ప్రక్రియను జీలకర్ర వేగవంతం చేస్తుంది. ఇది అధిక ఆకలిని కంట్రోల్ చేస్తుంది.కరివేపాకును నమలడం లేదా తినడం వల్ల శరీరం నుండి వచ్చే హానికారకమైన విషాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే దానిని శరీరం నుండి తొలగిస్తుంది. అందువల్ల ఆకులు శరీరాన్ని సహజంగా నిర్విషీకరణ చేయడానికి ఎక్కువ కేలరీలను కరిగించడానికి ఉపయోగపడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • flax seeds
  • Flax Seeds Benefits
  • health tips
  • weight loss

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd