Fennel Seeds : సోంపు గింజల్లో ఎన్ని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
కొన్నివేల సంవత్సరాలుగా సోంపు(Sompu) గింజలను వివిధ ఔషధాల్లో వినియోగిస్తున్నారు. పురాతన కాలంలో వీటిని బ్రీత్ ఫ్రెషనర్ గా, జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ఉపయోగించేవారు. ఇప్పటికీ వీటిని ఎక్కువగా అన్నం తిన్నాక జీర్ణక్రియ కోసం ఉపయోగిస్తుంటారు.
- By News Desk Published Date - 06:30 PM, Sun - 7 May 23

సోంపు గింజలు(Fennel Seeds). వీటి శాస్త్రీయ నామం ఫోనికులమ్ వల్గేర్. చూడటానికి జీలకర్ర మాదిరి ఆకారంలో ఉండే సోంపు గింజలు తియ్యగా ఉంటాయి. కొన్నివేల సంవత్సరాలుగా సోంపు(Sompu) గింజలను వివిధ ఔషధాల్లో వినియోగిస్తున్నారు. పురాతన కాలంలో వీటిని బ్రీత్ ఫ్రెషనర్ గా, జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ఉపయోగించేవారు. ఇప్పటికీ వీటిని ఎక్కువగా అన్నం తిన్నాక జీర్ణక్రియ కోసం ఉపయోగిస్తుంటారు. అలాగే వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా సోంపు సహజ నివారిణిగా పనిచేస్తుంది.
1. సోంపు గింజల్లో డైటరీ ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైటో కెమికల్స్ ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి సూక్ష్మ పోషకాలను కూడా కలిగి ఉంటాయి.
2. సోంపు గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆర్థసైటిస్, గుండెజబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాల నుండి సోంపు గింజలు రక్షణనిస్తాయి.
3.సోంపు గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ద్వారా కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి.
4. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి వాటి నుండి ఉపశమనం పొందేందుకు సోంపును తింటారు.
5. మహిళలకు రుతుస్రావం సమయంలో సోంపు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రుతు విరతి, తిమ్మిర్లు, మూడ్ స్వింగ్స్ వంటి వాటి నుంచి ఉపశమనం ఉంటుంది.
6. సోంపు గింజల్లో గ్లాసు పాలలో కంటే 10 రెట్లు కాల్షియం లభిస్తుంది. ప్రతిరోజూ ఒక ఆహారం తీసుకున్న తర్వాత ఒక స్పూన్ సోంపు గింజలను తినడం ఆరోగ్యానికి మంచిది. అందుకే పూర్వకాలం నుంచి భోజనం తిన్నాక సోంపు తినడం మనకు అలవాటు చేశారు.
7. సోంపు గింజలు తినడం వల్ల వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది తమ డైట్ లో తీసుకుంటారు.
Also Read : health vegetables: దొండకాయ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?