Raw Banana Benefits: పచ్చి అరటి పండ్లతో ఎన్ని ప్రయాజనాలో తెలుసా.. ఆ రోగాలన్నీ మాయం?
మనకు మార్కెట్ లో ఏడాది కాలం పాటు దొరికే పండు అరటి పండు. అయితే అరటి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనకు తెలుసు.
- By Anshu Published Date - 10:25 AM, Sat - 9 July 22

మనకు మార్కెట్ లో ఏడాది కాలం పాటు దొరికే పండు అరటి పండు. అయితే అరటి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనకు తెలుసు. పండిన అరటిపండు మాత్రమే కాకుండా పచ్చి అరటికాయ వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలో కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, జింక్ మొదలైనవి ఉంటాయి. పచ్చి అరటికాయ శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అదేవిధంగా పచ్చి అరటికాయను భోజనంతో పాటు కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.
పచ్చి అరటికాయలు ఎక్కువ శాతం పీచు పదార్థం ఉండటం వల్ల త్వరగా ఆకలి కాదు. తద్వారా ఎక్కువగా తినాలి అన్న కోరిక తగ్గుతుంది. పచ్చి అరటికాయ వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా ఈ పచ్చి అరటికాయలు శరీరంలోని ముడతలను తగ్గిస్తాయి. పచ్చి అరటికాయలో ఉండే మెగ్నీషియం వల్ల కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. పచ్చి అరటికాయలో ఉండే వగరు వల్ల తినే ఆహారంలో ఉండే విటమిన్స్, మినరల్స్ ను తొందరగా శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది.
అయితే ప్రతిరోజు ఒక పూట పచ్చి అరటికాయతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు కూడా బాగా మెరుగుపడి రక్తం బాగా శుభ్రపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు తొలగి మలబద్దకం రాకుండా చేస్తుంది. పచ్చి అరటి పండులో మధుమేహ నిరోధక లక్షణాలు ఉన్నాయి. అలాగే ఈ పచ్చి అరటికాయ రక్తంలోని చక్కర స్థాయిలను క్రమ బద్ధీకరిస్తుంది. ఈ పచ్చి అరటికాయతో చేసిన వేపుడు, బజ్జీలు, సాంబారు లాంటివి రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.